Biggest plane crashes in India:  అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాణికులతో పాటు హాస్టల్ పై విమానం పడటంతో మెడికోలు కూడా చనిపోయారు. అతి పెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. దేశంలో ఇంతకు ముందు కొన్ని భారీ విమాన ప్రమాదాలు జరిగాయి.  

1. 1996లో హర్యానాలో ఢీకొన్న రెండు విమానాలు -  349 మంది మృతి నవంబర్ 12, 1996న సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 763 (బోయింగ్ 747-168B) , కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1907 (ఇల్యూషిన్ Il-76TD) చార్ఖీ దాద్రీ, హర్యానా వద్ద ఢీకొన్నాయి. రెండు విమానాలలోని అందరూ చనిపోయారు. మొత్తం  349 మంది చనిపోయారు.  గగనంలో ఢీకొనడం, ఎత్తు సూచనల ఉల్లంఘన ,  సమాచార లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.  ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన  విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.  సౌదీ ఫ్లైట్ ఢిల్లీ నుండి ధాహ్రాన్‌కు వెళుతుండగా, కజకిస్తాన్ ఫ్లైట్ షిమ్‌కెంట్ నుండి ఢిల్లీకి వస్తోంది.  విమానాల ఎత్తును నియంత్రణలో ఉంచకపోవడం  కారణంగా ఈ ఘటన జరిగింది.

2. 1978లో ముంబై సమీపంలో క్రాష్ - 213  మంది మృతి 

జనవరి 1, 1978న  బోయింగ్ 747-237B విమనం  ముంబై సమీపంలో అరేబియన్ సముద్రంలో కూలిపోయింది.  213 మంది చనిపోయారు.  టేకాఫ్ తర్వాత 101 సెకన్లలో కూలిపోయింది. ఇన్‌స్ట్రుమెంట్ మాల్‌ఫంక్షన్ (అటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్) ,  పైలట్ ఎర్రర్ కారణంగా సముద్రంలో కూలిపోయింది. ముంబై నుండి దుబాయ్‌కు వెళుతున్న ఈ విమానం లో ఉన్న ప్రయాణికులంతా చనిపోయారు. 

3.2010లో మంగళూరు విమాన ప్రమాదం - 158 మంది మృతి

మే 22, 2010న  బోయింగ్ 737-8HG విమానం  మంగళూరు ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురయింది. ఇందులో 158 మంది చనిపోయారు.  విమానం రన్‌వేను దాటి కిందకు పడిపోయింది. పైలట్ ఎర్రర్, సరిగ్గా ల్యాండింగ్ ప్లాన్ చేయకపోవడం , అధిక ఎత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.  దుబాయ్ నుండి మంగళూరుకు వచ్చిన ఈ విమానం, టేబుల్‌టాప్ రన్‌వేలో ల్యాండింగ్ సమయంలో 30 అడుగుల లోయలో పడి రెండు భాగాలుగా విడిపోయింది.

4. నాలుగో స్థానంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మృతుల సంఖ్య ప్రకారం చూస్తే నాలుగో స్థానంలో ఉంది. మృతులపై అధికారిక జాబితా ఇంకా విడుదల కాలేదు, కానీ విమానంలో 242 మంది ఉన్నారు. వీరు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవు.  టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లలో విమానం కూలిపోయింది, మే డే కాల్ ఇచ్చిన తర్వాత ATCకు స్పందన లేదు. 

5. 1988nలో అహ్మదాబాద్‌లో  కూలిన విమానం - 133 మంది మృతి

అహ్మదాబాద్‌లోనే  అక్టోబర్ 19, 1988న మరో ఓ విమానం కూలింది.  బోయింగ్ 737 విమానం   133  ప్రయాణికులతో వెళ్తూ కూలిపోయింది. అందరూ చనిపోయారు.  ఈ విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. 

అలాగే  ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 1344  ఆగస్టు 7, 2020న కోజికో ఎయిర్ పోర్టులో ప్రమాదానికి గురయింది. రన్‌వేను దాటి 30 అడుగుల లోయలో పడిపోయింది. 190 మందిలో 21 మంది చనిపోయారు.  వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుండి భారతీయులను తిరిగి తీసుకొస్తున్న ఈ విమానం, కోజికోడ్ టేబుల్‌టాప్ రన్‌వేలో ల్యాండింగ్ సమయంలో విడిపోయింది.