Opposition MPs March:


రాష్ట్రపతి భవన్‌పై ర్యాలీ..


ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ చేపట్టాయి. "Democracy in Danger" అనే బ్యానర్ పట్టుకుని మార్చ్ నిర్వహించాయి. భారీ బందోబస్తు మధ్య ఈ ర్యాలీ కొనసాగింది. విజయ్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ప్రతిపక్ష నేతలు. అదానీ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 


"ప్రధాని మోదీ కీలక విషయాలను దాచేస్తున్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ప్రభుత్వం నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విదేశాలకు వెళ్లిపోయారు. ప్రధాని వీటిపై ఏ మాత్రం నోరు మెదపడం లేదు. రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదు. దీనర్థం అలాంటి వాళ్లు దోచుకుంటూనే ఉంటారు. మేం మాత్రం నోరు మూసుకుని ఉండాలనేగా..? మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని లెటర్ రాసిన పట్టించుకోలేదు. ఇదే ధోరణి కొనసాగితే మన దేశంలోనూ నియంతృత్వం వచ్చేస్తుంది."


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 




పరువు నష్టం దావా కేసులో రాహుల్‌ను ఇరికించి ప్రతిపక్షం అనేదే లేకుండా చూడాలని బీజేపీ  కుట్ర పన్నుతోందని ఆప్‌ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.