Delhi CBI Raids:


సీబీఐకి స్వాగతం: సీఎం కేజ్రీవాల్ 


ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రపంచమంతా దిల్లీ ఎడ్యుకేషన్ మోడల్, హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటోందని ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్‌లో ఫ్రంట్‌ పేజ్‌లో ఢిల్లీ స్కూల్‌తో పాటు సిసోడియా ఫోటోతో ఉన్న ఆర్టికల్‌ వచ్చింది. "Our Children are worth it" అనే టైటిల్‌తో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన కేజ్రీవాల్ "అమెరికాకు చెందిన అతి పెద్ద న్యూస్‌పేపర్ న్యూయార్క్‌టైమ్స్‌ ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసించింది. సిసోడియా ఫోటో కూడా వేసింది. ఇదే రోజున కేంద్రం ఆయన ఇంటికి సీబీఐని పంపింది. సీబీఐకి స్వాగతం. మేము వారికి సహకరిస్తాం. గతంలోనూ ఇలాంటి సోదాలు జరిగాయి. మేం తప్పు చేశామని అప్పుడు రుజువు కాలేదు. ఇకపైనా కూడా ఇంతే" అని ట్వీట్‌ చేశారు సీఎం కేజ్రీవాల్. ప్రపంచమంతా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుకోవటాన్ని, భాజపా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని విమర్శించారు. "ఈ 75 ఏళ్లలో మన దేశానికి మంచి చేసిన వాళ్లు ఇలాంటి సవాళ్లే ఎదుర్కొన్నారు. అందుకే భారత్ ఇలా వెనకబడిపోయింది. కానీ దిల్లీకి మంచి చేయాలన్న మా ఆలోచనను పక్కన పెట్టేదే లేదు" అని కేజ్రీవాల్ ట్వీట్‌ చేశారు. అటు సిసోడియా కూడా ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు. "మంచి పని చేసే వాళ్లకు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారు" అని ట్వీట్ చేశారు.









 


ఉత్తమ విద్యా మంత్రి సిసోడియా: కేజ్రీవాల్ 


సీబీఐ సోదాలు జరగక ముందు రోజు సీఎం కేజ్రీవాల్...డిప్యుటీ సీఎం సిసోడియాపై ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ఇప్పటి వరకూ ఉన్న వారిలో బెస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సిసోడియానే అని కితాబునిచ్చారు. ప్రస్తుతానికి దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మొత్తం 21 ప్రాంతాల్లో సీబీఆ సోదాలు నిర్వహిస్తోంది. ఎక్సైజ్ పాలసీ కేసులో భాగంగా ఈ సోదాలు జరుపుతున్నారు. "దిల్లీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ ఇంటితో పాటు 21 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి" అని ANI తెలిపింది. ఢిల్లీలో పరిస్థితి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అనేలా కనిపిస్తోంది. ఇటీవల ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లే జరుగుతోంది. ఇటీవల ఓ మంత్రిని అరెస్ట్ చేశారు. మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. నేటి ఉదయం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొందరు సీబీఐ అధికారులు ఆప్ నేత సిసోడియా ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. 


Also Read: Krishna Janmashtami 2022: పుట్టకముందే శత్రువు సిద్ధం, పుట్టాక రోజుకో గండం - అయినా అడుగుకో పాఠం నేర్పించిన శ్రీ కృష్ణుడు