బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఆగస్టు 22న ప్రకటించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయనున్నారు. ఈ ఏడాదిలో కూడా 1500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రత్యేక కేటగిరి కింద 96 సీట్లు పోగా.. మిగిలిన 1404 సీట్లలో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తారు. జనరల్‌కు మిగిలిన 702లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తారు. దీంతోపాటు 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు, 75 గ్లోబల్ సీట్లు అందుబాటులో ఉంటాయి.



Also Read: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!



నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ప్రకటనలో జాప్యం కొనసాగుతోంది. ఆగస్టు రెండో వారంలో నోటిఫికేషన్‌ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో పాటు ఈడబ్ల్యూఎస్​ కోటాపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో తర్జనభర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాలకు సంబంధించి తాజా సమాచారం వెలువడింది.



ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 శాతం సీట్లు కేటాయించాల్సి రావడంతో... న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.



Also Read: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇవే!



తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసర ఆర్జీయూకేటీలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 30న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది (2021-22) తెలంగాణ పాలిసెట్‌-2021లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. అయితే ఈసారీ పాలిసెట్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని నోటిఫికేషన్‌ను మొదట్లో విడుదల చేసినప్పటికీ.. అలా చేస్తే గ్రామీణ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పలు వర్గాల నుంచి వినతులు రావడంతో ఉన్నత విద్యామండలి పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే, పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది.



తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో మొదటి ప్రయత్నంలోనే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌‌లో ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.400 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.350)లు చెల్లించవల్సి ఉంటుంది.


 


Virchow Scholarship Program: బాలికల విద్యకు ప్రోత్సాహం - విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిభ కలిగిన, ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువు కోసం విర్చో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2022 ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్ కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి లేదా ఇంటర్ లేదా ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నవారు, ప్రభుత్వ కళాశాలల్లో డిప్లొమా, డిగ్రీ చదువుతున్న బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల్లోపు ఉండాలి. 
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..