Delhi Mayor Election:


వాగ్వాదాలు..నినాదాలు..


ఢిల్లీ మేయర్ నియామకం విషయంలో పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. సివిక్ సెంటర్‌లో బీజేపీ, ఆప్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. ప్రోటెమ్ స్పీకర్‌గా ఆప్ అభ్యర్థి ముఖేశ్ గోయల్‌ను కాదని బీజేపీకి చెందిన సత్య శర్మను ఎలా నియమిస్తారంటూ ఆప్ గొడవకు దిగింది. ఎలాగోలా సత్య శర్మ ప్రమాణ స్వీకారం చేసినా...ఆ తరవాతే మళ్లీ గొడవ మొదలైంది. ఎన్నికైన కౌన్సిలర్‌లను కాకుండా ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయాలని పిలవడంపై ఆప్  తీవ్రంగా మండి పడింది. "ఇది అనైతికం" అంటూ విరుచుకు పడింది. ఈ కారణంగా...మేయర్‌ ఎన్నిక కోసం జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై బీజేపీ స్పందించింది. "ఆప్ ఎందుకు భయపడుతోంది. నైతికంగా ఆ పార్టీ ఓడిపోయింది. వాళ్ల కౌన్సిలర్లే వాళ్లకు సపోర్ట్ ఇవ్వరు అని ఆ పార్టీ భావిస్తోంది" అని విమర్శించారు బీజేపీ ఎంపీ మనోజ్ తివారి. అటు ఆప్ కౌన్సిలర్లు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  "నామినేటెడ్ కౌన్సిలర్లను పిలిచి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిని మేం వ్యతిరేకించాం.  గొడవ అంతా అప్పుడే మొదలైంది. ఎన్నికైన కౌన్సిలర్లే ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలని పట్టుబట్టాం. బీజేపీయే కావాలని ఇలా చేసింది" అని మండి పడ్డారు. 










బీజేపీ అసహనం..


"ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇది బ్లాక్‌ డే. వాళ్లు చేసిన గొడవను కచ్చితంగా ఖండించాల్సిందే. ఢిల్లీ ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. మొదటి రోజే హౌజ్ ఇలా నడవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆప్‌ను ఏ భయం వెంటాడుతోందో అర్థం కావట్లేదు" అని బీజేపీ నేత కపిల్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. ప్రోటెమ్ స్పీకర్ అందరినీ కూర్చోవాలని చెబుతున్నా...ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. గట్టిగా నినాదాలు చేస్తూ గొడవ పడుతున్నారు. 


Also Read: Hyderabad news: "నాకు క్యాన్సర్ ఉందని తెలుసు, అమ్మ నాన్నకు చెప్పకండి" - ఓ డాక్టర్ చెప్పిన ఆరేళ్ల చిన్నారి కన్నీటి కథ