Delhi Liquor Policy Case:



విచారించడం కుదరదు: సుప్రీంకోర్టు 


CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. 
హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేలవ్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్‌ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదని, ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు లేదని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకి తెలిపారు. అయితే...ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బిజీగా ఉంటున్నారని వివరించారు. ఆయనే ట్రిబ్యునల్ విధులూ నిర్వర్తిస్తున్నారని చెప్పారు. సిసోడియా అరెస్ట్‌ను తప్పు పట్టారు సింఘ్వీ. అయితే...సుప్రీంకోర్టు మాత్రం "మీరేం చెప్పినా హైకోర్టులోనే చెప్పుకోండి. మేం ఈ పిటిషన్‌ను విచారించలేం" అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తామని, హైకోర్టుకు వెళ్తామని ఆప్ స్పష్టం చేసింది.