Delhi Liquor Policy Case:
5 రోజుల కస్టడీలో..
సీబీఐ అరెస్ట్‌ను నిరసిస్తూ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా. ఇప్పటికే విచారణ పూర్తి చేసిన అధికారులు 5 రోజుల కస్టడీలో ఉంచారు. దీన్ని సవాలు చేస్తూ సిసోడియా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ సిసోడియాపై ఆరోపణలు చేస్తోంది CBI.ఇప్పటికే ఆయనను రెండు సార్లు విచారించింది. ఇటీవలే ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు తరవాత అరెస్ట్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తరవాత కోర్టులోనూ హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు,సిసోడియా తరపున న్యాయవాది తమ తమ వాదనలు వినిపించారు. కచ్చితంగా అవకతవకలు జరిగాయని CBI చెబుతుంటే...అలాంటిదేమీ లేదని సిసోడియా తరపున న్యాయవాది వాదించారు. చివరకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.