Manish Sisodia:


కస్టడీ పొడిగింపు 


లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా CBI అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కోర్టుకు వెల్లడించారు. రోజూ ప్రశ్నలు అడిగి బాగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 5 రోజుల పాటు కస్టడీలో ఉంచిన CBI శనివారం ఆయనను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈ క్రమంలోనే సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. 


"ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచే ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. అడిగినవే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్‌లు ఏమీ లేవు. దాదాపు 9-10 గంటల పాటు కూర్చోబెడుతున్నారు. ఇది మానసిక వేధింపుల కన్నా తక్కువేమీ కాదు"


-మనీష్ సిసోడియా


ఈ వాదనలు విన్న కోర్టు మార్చి 6 వరకూ CBI కస్టడీని పొడిగించింది. మార్చి 10వ తేదీన మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది. సిసోడియా విచారణకు సరైన విధంగా సహకరించడం లేదని, కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కోర్టుని కోరారు అధికారులు. ఈ మేరకు కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. అయితే...సిసోడియా తరపు న్యాయవాది మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే CBI నడుచుకుంటోందని విమర్శించారు. 


"CBI నిజానిజాలతో పని లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తోంది. ఇదంతా కేవలం మనీష్ సిసోడియాను వేధించడానికి మాత్రమే"


- సౌరభ్ భరద్వాజ్, ఢిల్లీ మంత్రి 










అటు సిసోడియా బెయిల్ కోసం పిటిషన్‌లు వేస్తున్నా లాభం లేకుండా పోయింది. . CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్‌ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. అయితే రౌజ్ అవెన్యూ కోర్టు కూడా సిసోడియా పిటిషన్‌ను పట్టించుకోలేదు. పైగా కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెండు చోట్లా ఆయనకు చుక్కెదురైంది. 


Also Read: American Airlines Incident: ఫ్లైట్‌లో తోటి ప్రయాణికుడిపై యూరినేట్ చేసిన వ్యక్తి,ఈ సారి అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో