Where Is Monsoon :  జూన్ తొలి వారంలో పలకరించి తొలకరి ఈ ఏడాది పది తేదీ వచ్చేసినా పలకరించలేదు. ఎండలకు ఇబ్బందిపడిన వారంతా తొలకరి జల్లుల్లో సేదదీరాలనుకుంటూంటే...రుతుపవనాలు మాత్రం ఇంకా కనికరించడం లేదు. ఎప్పుడో మూడు వారాల కిందటే అండమాన్‌కు వచ్చాయి.  కేరళనూ తాకాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ప్రభావంచూపించడం లేదు. 


దసరా రోజున తిరుపతి నుంచి యాత్ర ప్రారంభిస్తున్న పవన్ - విప్లవమేనంటున్న నాగబాబు !


రుతుపవనాలు బలహీనం -   పడుతున్న వర్షాలు రుతుపవనాల వల్ల కాదు !


నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం అవుతున్నది. బంగాళ ఖాతంలో గాలులు బలహీనంగా ఉన్నాయని, దీంతో రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం అవుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఈ నెల 14వ తేదీ తరువాతనే రుతుపవనాల ఆగమనం గురించి స్ప‌ష్ట‌త వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల చెబుతున్నారు.  ప్ర‌స్తుతం అక్కడక్కడ  కురుస్తున్న వ‌ర్షాలు.. రుతుప‌వ‌నాల వ‌ర్షాలు కాదని తెలుస్తోంది.  


ఏపీ వాణిజ్య పన్నుల శాఖలోనూ ఓటీఎస్ స్కీమ్ - అధికారులకు సీఎం జగన్ ఆదేశం


తొలకరి మరింత ఆలస్యం -   నాలుగు రోజుల తర్వాత క్లారిటీ వస్తుందన్న వాతావరణ శాఖ !


ఈ సంవత్సరం మూడు రోజుల ముందుగానే మే 29వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి జూన్ జూన్ 2వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి కార్వార్, చిక్ మంగుళూరు ,బెంగుళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. ఉపరితల ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడం లేదు.


టీడీపీ నేతలతో మాట్లాడలేదు - గన్నవరం రాజకీయాల్లోనే ఉంటానన్న యార్లగడ్డ వెంకట్రావు !


మండిపోతున్న ఎండలు - మరో వారం భరించాల్సిందేనా ?


రుతుపవనాలు రావడమే బలహీనంగా వచ్చినట్లుగా తెలు్సతోంది. కేరళ, గోవా, కొంకణ్‌, కర్నాటక, తమిళనాడులలో విస్తరించిన రుతుపవనాలు కూడా బలహీనంగా ఉండడంతో అక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి.   రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఉష్ఱోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శుక్ర‌వారం 21 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 43.3 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు, ములుగు జిల్లా మేడారంలో 43.2, కరీంనగర్‌ జిల్లా తంగులలో 43 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.