Rajnath Singh:
ట్వీట్ చేసిన రాజ్‌నాథ్ సింగ్..
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు. మంగోలియా అధ్యక్షుడు ఖురేల్‌సుఖ్ (Khurelsukh)ఈ గిఫ్ట్ ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ ఆ స్పెషల్ గిఫ్ట్‌కి "తేజస్" అనే పేరు కూడా పెట్టేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పనే లేదు కదూ. అది ఓ మంగోలియన్ గుర్రం (Mangolian Horse).చెంఘిస్ ఖాన్ కాలం నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ గుర్రాలకున్న ప్రత్యేకతే వేరు. అక్కడ గుర్రాలను పెంచుకోవటం వారి సంస్కృతిలో భాగం. మంగోలియాలో మనుషుల కన్నా జంతువుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మంగోలియన్ కల్చర్‌లో గుర్రాలు ఎంతో స్పెషల్. గుర్రాలు మృతి చెందిన తరవాత వాటి ఆత్మలు యజమానిని ఇబ్బంది అయినా పెడతాయి, లేదంటే మంచైనా చేస్తాయి అని అక్కడ బలంగా నమ్ముతారు. బతికున్నన్ని రోజులు వాటిని ఎంత బాగా చూసుకుంటే...అవి చనిపోయాక వాటి ఆత్మ అంత శాంతిస్తుందని విశ్వసిస్తారు. ఒకవేళ అవి యజమానిపై కోపంగా ఉంటే...అతని వద్ద ఉన్న మిగతా పాడి నాశనమవుతుందని భావిస్తారు.
రక్షణ భాగస్వామ్యం కోసం..
భారత్-మంగోలియా మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని పెంచే దిశగా...రాజ్‌నాథ్ సింగ్ మంగోలియన్ డిఫెన్స్ మినిస్టర్ సైఖన్‌బయార్ గుర్సేడ్ (Saikhanbayar Gursed)తో సెప్టెంబర్ 6న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ వరుస ట్వీట్‌లు చేశారు. భారత్-మంగోలియా మధ్య వైవిధ్యమైన, వ్యూహాత్మకమైన రక్షణ భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. మీటింగ్ చాలా బాగా జరిగిందని, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగోలియాతో పాటు జపాన్‌తోనూ ఇదే విధమైన మైత్రి కొనసాగించాలని భావించిన భారత్...ఆ దేశంతోనూ చర్చలు జరపనుంది. మొత్తం 5 రోజుల పర్యటనలో భాగంగా...రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జపాన్ వెళ్లనున్నారు. ఈ టూర్‌లోనే మంగోలియా మినిస్టర్ నుంచి ఈ తెల్ల గుర్రాన్ని గిఫ్ట్‌గా పొందారు రాజ్‌నాథ్. అంతకు ముందు 2015లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా
మంగోలియన్ హార్స్‌ను గిఫ్ట్‌గా పొందారు.
Also Read: Nitin Gadkari: సైరస్ మిస్త్రీ ప్రమాదంతో అలెర్ట్ అయిన కేంద్రం - ఇక నుంచి అన్ని వాహనాలకు అది తప్పనిసరి