India will avenge the Kashmir terror attack: టెర్రరిజం విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని పాటిస్తామని భారతరక్షణ మంత్రిరాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రదాడిపై అతి త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం తీర్చుకుటామని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన టెర్రరిస్టులనే కాదు. ఈ దాడికి సూత్రధారులైన వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు.                       

Continues below advertisement


 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  టెర్రరిస్టులకు బలమైన హెచ్చరిక ాజరీచేశారు.  రాజ్‌నాథ్ సింగ్ ఈ దాడిని "పిరికి చర్య"గా ఖండించారు.  దాడి చేసిన వారిని మాత్రమే కాకుండా, వారి వెనుక ఉన్న శక్తులను కూడా మేము చేరుకుంటాము. దోషులకు త్వరలోనే స్పష్టమైన, బలమైన సమాధానం లభిస్తుందని హెచ్చరించారు.  ఈ దాడిని ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన చర్యగా వర్ణించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలపై నమ్మకం ఉంచాలని దేశ ప్రజల్ని కోరారు.[ 



రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 23, 2025న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె సింగ్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌లతో 2.5 గంటల సమావేశం నిర్వహించి, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఈ దాడి తర్వాత పర్యాటక రంగంలో భద్రతా " భయాలను"ను తగ్గించేందుకు సైన్యం ,  పారామిలిటరీ బలగాల శాశ్వత మోహరింపును ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు  చెబుతున్నారు. 


కశ్మీర్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.  పాకిస్తాన్ కూడా భారత్ తమపై దాడి చేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. దాడి చేస్తే కాచుకోవడానికి సిద్ధమని సంకేతాలు పంపుతూ.. సరిహద్దుల వద్ద యుద్ధ విమానాలను మోహరిస్తోంది. సైనికుల్ని అప్రమత్తం చేస్తోంది. అయితే పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌ లో నిధులు కేటాయించడంలేదు.  సైనికులకు జీతాలు ఇస్తే గొప్పన్నట్లుగా ఉంది. వారి యుద్ధ సన్నాహాలన్నీ పైకి మాత్రమేనని అంటున్నారు.  భారత్ ఒక్క రోజు చేసే దాడితో పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇప్పుడు భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది.