Death Threat to CM: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఓ ఆగంతకుడు నేరుగా పోలీసులకే ఫోన్ చేసి సీఎంను చంపేస్తున్నామని సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని IANS వార్తా సంస్థ వెల్లడించింది. నిందితులను పట్టుకునేందుకు ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం, ఒక వ్యక్తి  నిన్న  రాత్రి ఘజియాబాద్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి  Delhi CM Rekha Guptaను  చంపేస్తానని బెదిరించాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పీసీఆర్‌కు ఫోన్ వచ్చింది, ఆ తర్వాత వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని, అతని లొకేషన్‌ను గుర్తించే పనిలో ఉన్నారు.

ఘజియాబాద్  సిటీ డీసీపీ  ఈ విషయాన్ని ధృవీకరించారు, అయితే ఫోన్ చేసిన వ్యక్తి ఆ తర్వాత తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు.

"ఘజియాబాద్ పోలీసుల నుండి నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులకు ఈ సమాచారం అందింది. ప్రస్తుతం ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు" అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.