Cyclone Michaung Effect On Transport: మిగ్‌జాం తుపాను రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే పలు విమానాశ్రయాలు నీటితో నిండిపోయాయి. అందుకే వైజాగ్‌ నుంచి వెళ్లే విమానాలను అధికారులు రద్దు చేశారు. 16 విమానాల రాకపోకలు రద్దు చేశారు. 


మరోవైపు రైల్వే వ్యవస్థపై కూడా మిగ్‌జాం ఎఫెక్ట్ పడింది. దీని కారణంగా సుమారు 150 రైళ్లు  అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కాచిగూడ- చెంగల్పట్టు, హైదరాబాద్‌- తాంబరం, సికింద్రాబాద్‌- కొల్లాం, సికింద్రాబాద్‌-తిరుపతి, లింగంపల్లి- తిరుపతి, సికింద్రాబాద్- రేపల్లె, కాచిగూడ-రేపల్లె, చెన్నై- హైదరాబాద్‌, సికింద్రాబాద్‌- గూడూరు, సికింద్రాబాద్‌-త్రివేండ్రం స్టేషన్ల మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. 


అత్యవసరమైన ప్రయాణాలు ఉంటే తప్ప మిగతా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చెన్నై, విజయవాడ, సికింద్రాబాద్, విశాఖ పట్నం, బెంగళూరు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఆయా స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేయాలని సూచిస్తున్నారు. మిగతా వాళ్లు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణికులు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటే వాళ్లకు పూర్తి స్థాయిలో టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. 


పాక్షికంగా రద్దు చేసిన ట్రైన్స్ 
22159 ముంబైయి సీఎస్‌ఎంటీ - చెన్నై సెంట్రల్‌ ట్రైన్ ను రేణిగుంట వద్ద ఆపేశారు. 
22160 చెన్నై సెంట్రల్‌ - ముంబై సీఎస్‌ఎంటీ ట్రైన్‌ను రేణిగుంట వచ్చే మార్గ మధ్యలో ఆపేయనున్నారు. 
22179 మంబై ఎల్టీటీ- చెన్నై సెంట్రల్ ట్రైన్ కూడా రేణిగుంట వద్ద ఆపేయనున్నారు. 


22180 చెన్నై సెంట్రల్‌- ముంబై ఎల్టీటీ ట్రైన్‌ను రేణిగుంటకు వచ్చే మార్గంలో నిలేపేస్తారు.