నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పీఎస్‌లో లాకప్ దెత్ సంచలనంగా మారుతోంది. అన్నదమ్ముల భూముల పంచాయతీలో స్థానిక నాయకుల జోక్యం చేసుకోవడంతో వివాదం చావు వరకు వెళ్లింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణమైన వ్యక్తి కాంగ్రెస్ నేతని ఓ వర్గం అంటుంటే కాదు ఆయన బీఆర్‌ఎస్ పార్టీ లీడర్‌గా మరికొందరు చెప్పుకుంటున్నారు.
అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదం రాజకీయ జోక్యంతో స్టేషన్‌కు వెళ్లింది. ఇది ఇప్పుడు ఓ కుటుంబంలో విషాదం నింపింది. పాలెం తండాకు చెందిన సూర్యనాయక్ అనే వ్యక్తికి తన సొదరిడితో భూ వివాదం ఉంది. ఇందులో స్థానిక ఎంపీటీసీ వసంత్ నాయక్ జోక్యం చేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన జోక్యంతోనే సూర్యనాయక్‌ను పోలీసులు తీసుకెళ్లాలని చెబుతున్నారు.
ఎంపీటీసీ ఒత్తిడితోనే సూర్యను తీసుకెళ్లిన పోలీసులు చావబాదారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబం, ఆయన బంధువులు, చింతపల్లి ఎస్సై సతీష్‌రెడ్డి కొట్టిన దెబ్బలకు సూర్యనాయక్ స్టేషన్‌లోనే చనిపోయినట్టు చెబుతున్నారు. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పోలీస్ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారని అంటున్నారు. దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేసరికి చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని చెబుతున్నారు.
సూర్య చనిపోయిన విషయాన్ని బంధువులకు తెలియజేసి... వాళ్లు వచ్చే లోపు హడావుడిగా పోస్టుమార్టం చేయబోయని ఆరోపిస్తున్నారు బంధువులు. వారు వచ్చి ఆ ప్రక్రియను ఆపేశారని అంటున్నారు. ఎంపీటీసీ వసంత్ నాయక్ దగ్గరుండి ఎస్సైతో కొట్టించారని విమర్శిస్తున్నారు. ఇందులో సూర్య తప్పులేకపోయినా బీఆర్‌ఎస్ లీడర్ కొడుకున్న అన్న కారణంతోనే ఇదంతా చేయిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు కారణమైన ఎస్సై సతీష్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.