కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా 30 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో గడిచిన 24 గంటల్లో 29,836 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ చికిత్స పొందుతున్న వారిలో 75 మంది కన్నుమూశారని తెలిపింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 20,541కి చేరింది. కోవిడ్ బాధితుల్లో నిన్న ఒక్కరోజే 22,088 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 37,73,754కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 2,12,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 30 వేలకు పైబడే ఉంటుంది. ఇటీవల కేరళలో జరిగిన ఓనమ్ పండుగ కారణంగానే ఇక్కడ కేసుల సంఖ్య ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది. కేరళలో ఆగస్టు 21న ఓనమ్ జరిగింది. పండుగ కావడంతో ప్రజలంతా ఒక్కచోటకు చేరారని.. ఫలితంగా కోవిడ్ వ్యాప్తి పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,557 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి ఏపీలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 20,12,123కి చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 18 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 13,825కి పెరిగింది. కోవిడ్ చికిత్స పొందుతున్న వారిలో నిన్న 1,213 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 19,83,119కి పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 15,179 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,57,376కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బాధితుల్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 3,870కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: మేనత్తను లవ్ చేసిన అల్లుడు.. గర్భం దాల్చిందని ఇంట్లో తెలిసింది.. చివరకు వారి ప్రేమ కథ ఏమైంది?
Also Read: Kabul Blast Update: కాబూల్‌లో మరో బాంబు పేలుడు.. సూసైడ్ బాంబర్‌పై అమెరికా దాడి..