MLA Lasya Nandita Stuck in The Lift: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) లాస్య నందిత (Lasya Nandita) ఆదివారం లిఫ్టులో ఇరుక్కుపోయారు. బోయిన్పల్లిలోని ఓ ఆస్పత్రి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె కొందరితో కలిసి లిఫ్ట్ ఎక్కారు. అయితే, ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకు వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేతో పాటు అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేతో పాటు అందరినీ సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లాస్య నందిత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె. ఆయన మరణంతో ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ఈ టికెట్ స్థానిక నేతలు గట్టి ప్రయత్నాలే చేసినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నందితపైనే నమ్మకం ఉంచి సీటిచ్చారు. 2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్ గా గెలిచారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యారు.
Hyderabad News: లిఫ్టులో ఇరుక్కుపోయిన మహిళా ఎమ్మెల్యే - తలుపులు బద్దలుకొట్టి రక్షించిన సిబ్బంది
ABP Desam
Updated at:
24 Dec 2023 02:57 PM (IST)
MLA Lasya Nandita: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది. ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయారు. భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు.
ఎమ్మెల్యే లాస్య నందితకు తప్పిన ప్రమాదం