Gongura Chicken Curry Recipe : సండే రోజు చికెన్ ఎలాగో ఉంటుంది. అయితే రోటీన్​కు బ్రేక్​ ఇచ్చి చికెన్​తో వెరైటీగా ట్రై చేయాలనుకుంటే అమ్మో చికెన్ టేస్ట్ పోతుంది.. లేదంటే చికెన్ ఫీల్​ రాదేమో అనే భయం ఉంటే మీరు గోంగూర చికెన్ ట్రై చేయవచ్చు. ఇది మీకు డిఫరెంట్​ ఫ్లేవర్​తో పాటు అద్భుతమైన రుచిని ఇస్తుంది. గోంగూరలోని పులుపు.. చికెన్​ టేస్ట్​ను నెక్స్ట్​ లెవల్​కి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు సండేరోజు ఏదైనా కొత్త చేయాలనుకుంటే మాత్రం గోంగూర చికెన్ ట్రై చేయండి. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. అయితే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో? దానిని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


చికెన్ - అరకేజి


ఉల్లిపాయ - 1


పచ్చిమిర్చి - 3


కారం - 1 టీస్పూన్


ధనియా పొడి - 1 టీస్పూన్


జీలకర్ర - 1 టీస్పూన్


పసుపు - చిటికెడు


గోంగూర ఆకులు - 100 గ్రాములు


కొత్తిమీర - 1 కట్ట


అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్


ఉప్పు - రుచికి తగినంత


తయారీ విధానం


ముందుగా గోంగూర ఆకులను బాగా కడగాలి. లేదంటే దానిలో ఇసుక ఉండిపోతుంది. కాబట్టి గోంగూరను బాగా కడిగి నీటిని వంపేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచి.. దానిలో గోంగూర వేయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. దానిలోని నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు గోంగూరను మగ్గనివ్వాలి. అప్పుడే గోంగూర జ్యూసీగా, పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. ఇప్పుడు దానిని చల్లారనివ్వండి. తర్వాత దానిని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టండి. 


ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై ఓ కడాయి ఉంచండి. మంటను మీడియం సైజ్​లో ఉంచి కడాయిలో కాస్త నూనె వేసి వేడిచేయండి. దానిలో ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. దానిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్​ను దానిలో వేసి మగ్గనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత దానిలో కారం, ఉప్పువేసి బాగా కలపండి. దానిపై మూత ఉంచి.. మరో 10 నిముషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు చికెన్ సాఫ్ట్​గా మారుతుంది. ఇప్పుడు మీరు దానిలో కొంచెం నీరు వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్​ని వేసి దానిలో బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు గోంగూరతో ఉడికించి కొత్తిమీర వేసి స్టౌవ్ ఆపేయడమే. దీనిని మీరు వేడి వేడిగా అన్నంలో లాగిస్తే అద్భుతంగా ఉంటుంది. పైగా ఇది చల్లారిన తర్వాత మరింత టేస్ట్​ని మీకు అందిస్తుంది.


గోంగూర చికెన్​ను దాదాపు చికెన్ కర్రీ చేసుకున్నట్లే చేసుకుంటాము కానీ.. గోంగూర ఎక్స్​ట్రా ప్రాసెస్ అవుతుంది. కానీ టేస్ట్​లో మాత్రం చికెన్ కర్రీని మించిపోతుంది. మీరు కాస్త పులుపు ఇష్టపడేవారైతే.. ఇది మీకు కచ్చితంగా ఫేవరెట్ డిష్ అవుతుంది. పైగా ఈ రెసిపీతో మీకు గ్రేవీ కూడా కలిసి వస్తుంది. కొన్నిసార్లు చికెన్​ చేస్తే గ్రేవీ లేదని ఫీలయ్యే వారికి ఇది మంచి రెసిపీ అవుతుంది.


Also Read : వింటర్​లో అల్లం వెల్లుల్లి సూప్​ తాగితే.. ఇమ్యూనిటీ వీర లెవల్​లో వస్తుందట