ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఉన్నాయనే విషయాన్ని కేంద్రంలో ఉన్న భాజపాకు బలంగా వినిపించేలా నేడు 19 ప్రతిపక్ష పార్టీలు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపు మేరకు ఈ సమావేశంలో 19 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాలని సోనియా గాంధీ కోరినట్లు సమాచారం.
అవరోధాలన్నింటినీ దాటి 2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపాపై పోరాడటానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధం కావాలని సోనియా గాంధీ సమావేశంలో పిలుపునిచ్చారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలను బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమై భాజపాను ఓడించాలన్నారు దీదీ. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
ఎవరెవరు హాజరయ్యారు..
ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎల్జేడీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు.
Also read: ZyCoV-D Vaccine Emergency Approval: దేశంలో మరో టీకాకు అనుమతి.. 'జైకోవ్-డీ'కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్