Congress President Election Result:


యూపీలోనే అవకతవకలు..


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్‌ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించి...రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. ముఖ్యంగా యూపీలో ఎన్నో అవకతవకలు జరిగాయని థరూర్‌ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు వాళ్లు...కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి బుధవారం లేఖ రాసింది. "నిజానికి మేం లేఖ రాయాలని అనుకోలేదు. ఎన్నికలో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం. కానీ...కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. అందుకే...లేఖ రాశాం. యూపీలో పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగలేదు. ఖర్గే మద్దతుదారులు దగ్గరుండి మరీ ఈ అవకతవకలకు పాల్పడ్డారు. బహుశా..ఈ విషయం ఖర్గేకి తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని బ్యాలెట్ బాక్స్‌లకు సీల్‌ వేయలేదు. ఇది న్యాయమా..? అందుకే ఆ రాష్ట్రంలో పోలైన ఓట్లను చెల్లనివిగా పరిగణించాలి" అని లేఖలో పేర్కొంది థరూర్ బృందం. 


ఎవరో విజేత..?


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ ఇటీవలే ముగిసింది. దాదాపు 9,500 మంది కాంగ్రెస్ నేతలు.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు ఈ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే ఈ పోటీలో ఉన్నారు. వీరిలో ఖర్గేనే విజయం వరిస్తుందని ముందు నుంచి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 24 ఏళ్ల తరవాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికవ నున్నారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్‌ బాక్స్‌లతో పాటు కకీలక నేతలందరూ ఢిల్లీకి చేరుకున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కూడా ఎన్నిక ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఢిల్లీకి రానున్నట్టు సమాచారం. గాంధీ కుటుంబం నుంచి ఈ సారి ఎవరూ పోటీలో లేరు. కాంగ్రెస్ చరిత్రలో 22 ఏళ్ల క్రితం గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. జితేంద్ర ప్రసాద్, సోనియా గాంధీకి పోటీకా ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. అప్పుడు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఆమే ఆ పదవిలో కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్లకు ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌కు ఎక్కువ కాలం అధ్యక్షత వహించిన నేత సోనియా గాంధీయే. 
కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక జరగటం ఇది ఆరోసారి. 2017లో జరిగిన ఎన్నికలో..రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


"పార్టీలో సమూల మార్పులుతీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. మల్లికార్జున్ ఖర్గే చాలా సీనియర్ నేత. ఒకవేళ ఆయన గెలిస్తే పరస్పర సహకారంతో ముందుకెళ్తాం" అని శశిథరూర్ స్పష్టం చేశారు. "BJP,RSS ఐడియాలజీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం, పార్టీలో మార్పులు తీసుకురావటం నా బాధ్యత. భాజపా దేశాన్ని మతాల వారీగా విడదీస్తోంది. వెనకబడిన వర్గాల్లోనూ చిచ్చు పెడుతోంది. అన్ని ఎన్నికల దృష్టిలోనే చూస్తుండటం వల్లే ఈ సమస్యలు" అని వ్యాఖ్యానించారు మల్లికార్జున్ ఖర్గే. 


Also Read: Jayalalithaa Death Case: తమిళనాట జయలలిత డెత్ రిపోర్ట్‌ ప్రకంపనలు, విచారణకు సిద్ధమంటున్న శశికళ