Priyanka Gandhi Dosas: 



ఎన్నికల ప్రచారంలో..
 
కర్ణాటకలో క్యాంపెయినింగ్ జోరు మరింత పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రచారంలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మైసూరులో ర్యాలీ చేసిన ఆమె ఓ హోటల్‌కి వెళ్లారు. టిఫిన్ చేసేసి వస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆమె నేరుగా హోటల్‌లోని కిచెన్‌లోకి వెళ్లారు. అక్కడి వాళ్లను పలకరించారు. పక్కనే దోశ పిండి గిన్నె కనబడగానే తన చేతికి పని చెప్పారు. అక్కడి సిబ్బందితో మాట్లాడుతూనే పెనంపై దోశలు వేశారు ప్రియాంక గాంధీ. అట్లకాడ తీసుకుని చాలా నింపాదిగా వాటిని అటూ ఇటూ తిప్పారు. దోశలు రెడీ చేసిన తరవాత హోటల్‌ ఓనర్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వాళ్లందరితో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఈ వీడియోని తన ట్విటర్‌లో షేర్ చేశారు ప్రియాంక. దోశలు వేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానంటూ ట్వీట్ చేశారు. 


"మైలారీ హోటల్‌కి వెళ్లి అక్కడ దోశలు వేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. నిజాయితీ, శ్రమ ఉంటే ఎదుగుతాం అనడానికి ఈ హోటలే ఉదాహరణ. ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు హోటల్ ఓనర్‌కి చాలా థాంక్స్. దోశలు చాలా రుచిగా ఉన్నాయి. నా కూతురుని కూడా ఇక్కడికి తీసుకొచ్చి దోశలు తినిపిస్తాను"


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ