Hindutva is not ‘Fair and Lovely cream’:   హిందుత్వ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కాదని.. చలికాలం రాగానే పెదాలకు వేరే క్రీమ్, పాదాలకు వేరే క్రీమ్ వస్తుందని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ రాహుల్ గాంధీ పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  హిందుత్వ అనేది కేవలం పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే అని అన్నారు. మహారాష్ట్రలో జన్మించిన సావర్కర్ ను చూస్తే అర్థం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ దేవాలయ సందర్శన గురించి మీడియాలో వస్తున్న కథనాలపై కన్హయ్య ఘాటుగా స్పందించారు. హిందుత్వంలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ ఉండవని.. ఎలాగైతే పెద్ద పాము ఎంత విషపూరితమే.. చిన్న పాము కూడా అంతే విషపూరితం అని అన్నారు. 





మహారాష్ట్రలో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. హిందూత్వం అంశంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా  సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ లాంటివన్నీ.. ఎలాగైనా విషం విషమే అన్నారు.  చిన్న పాము కూడా పెద్ద పాములాగే విషాన్ని కలిగి ఉంటుందని వ్యాఖ్యానించారు  దయచేసి హిందూ మతాన్ని అవమానించకండి.. మతం పేరు చెప్పి ప్రజలను ఒకరితో ఒకరిని ఇరకాటంలో పడేసేది మతం కాదని.. ఎందుకంటే ఏ మతం అయినా మానవ మనస్సుకు విముక్తి కలిగించడమే అని కన్హయ్య అన్నారు.ఈ రోజుల్లో మన అవగాహన కూడా కలుషితం అవుతోందని.. సత్యాన్ని గ్రహించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. 


భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన చేస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఆయన కొన్ని ఆలయాలను సందర్శించారు. నుదుటిన విభూతితో ఆయన ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో హిందూత్వాన్ని రాహుల్ గాంధీ రాజకీయ అంశంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలను ఇతర పార్టీల నేతలు చేస్తున్నారు. దీనికి కన్హయ్య కుమార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆలయాలను మాత్రమే కాదని..  చర్చిలు, మసీదులను సందర్శించారని. ఆయన యాత్రలో పాఠశాలలు, కళాశాలలు, కర్మాగారాలు సందర్శించారని.. ప్రజలు జీవనోపాధి పొందే ప్రతీ ప్రదేశం మాకు పవిత్రమైనదే అని అందులో తప్పు వెదకాల్సిన అవసరం ఏముందని కన్హయ్య కుమార్ ప్రశ్నించారు.  


కాంగ్రెస్ పార్టీ ఓ ఉదాత్తమైన ఆశయంతో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తోందని.. మేము ప్రయాణికులు మాకు రహదారి కూడా పవిత్రమైదనదే అని కన్హయ్య అన్నారు. గతంలో హిందువులు, ముస్లింలు కలిసి ఉండలేదరని ముస్లిం లీగ్ చెప్పింది.. ఇదే విషయాన్ని హిందూ మహాసభ కూడా చెప్పిందని.. అయితే ఈ దేశం ఎలా ఏర్పడిందని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే ప్రసంగాలు చేసే వ్యక్తుల ఉచ్చులో మేం పడబోమని ఆయన అన్నారు.  కాంగ్రెస్ మార్క్ హిందూత్వ రాజకీయాలను కన్హయ్య కుమార్ ఇలా సమర్థించడం సంచలనంగా మారింది. అయితే చెప్పిన ఫెయిర్ అండ్ లవ్లీ.. చిన్న పాము..  పెద్ద పాము.. విషయం వంటి ఉదాహరణలు మాత్రం వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది.