పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రమాణస్వీకారం అనంతరం పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సహా పార్టీ నేతలతో ప్రెస్ మీట్‌లో మాట్లాడనున్నారు చన్నీ.


రాహుల్ శుభాకాంక్షలు..


పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.






కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రజలకు మనం ఇచ్చిన హామీలను తీర్చాలి. వారి నమ్మకమే అన్నిటికంటే మనకు ముఖ్యం.


                             రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


గవర్నర్‌తో భేటీ..


నూతన సీఎంగా తన పేరు ప్రకటించిన అనంతరం చన్నీ.. పంజాబ్ గవర్నర్‌ను కలిశారు.






సీఎం పదవిని స్వీకరించేందుకు నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల బలాన్ని గవర్నర్‌కు సమర్పించాం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.