ఎక్కడో రష్యా - ఉక్రెయిన్ ( Russia - Ukraine War ) యుద్ధం చేసుకుంటే ఇక్కడ ఇండియాలో సామాన్యుల ఇళ్లల్లోని వంట గదుల్లో సెగలు వస్తున్నాయి. ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ ( Sun Flower Oil ) రేటు పెరిగిపోయిందని ప్రజలు గగ్గోలు పెడుతూండగానే తాజాగా వంట గ్యాస్ ధరపై వడ్డించారు. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్‌ ( Gas ) ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాల గ్యాస్‌ ధరలను పెంచలేదు. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను మాత్రమే పెంచారు. 


చర్చలకు పిలిచి రష్యా దొంగదెబ్బ తీసే ప్రయత్నాలు - ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ


వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్ 19 కేజీల సిలిండర్‌ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో   సిలిండర్‌ ధర రెండు వేలు దాటింది. రాష్ట్రాల్లోని పన్నులను బట్టి కొద్దిగా హెచ్చ తగ్గులు ఉంటాయి.   ఐదు రాష్ట్రాల ఎన్నికలు ( Five State Elections ) జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌ ధరలు పెంచేక ప్రయత్నం చేయలేదని భావిస్తున్నారు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్‌ సిలిండర్లకు ధరల వాత తప​‍్పదనే ప్రచారం జరుగుతోంది. 


గూడూరు అటా ఇటా? రేపే నెల్లూరు జిల్లాపై సమీక్ష, ఏం తేల్చుతారో!


రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ( Crude Oil ) ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా పెట్రోల్, డిజిల్ ఇంధనం గ్యాస్ ధరలు అమాంతం పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి భారం ఆయిల్ కంపెనీలే భరిస్తున్నాయి. ప్రజలపై మోపడం లేదు. దీనికి కారణం ఐదురాష్ట్రాల ఎన్నికలు. అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉంచేలా తాము చర్యలు తీసుకుంటామని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. కానీ కేంద్రం ప్రకటన ఎంత వరకూ అమలవుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది. 


ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కాస్త తగ్గిస్తూ వచ్చారు. కానీ ఆ తగ్గింపు మొత్తం ఇప్పుడు యుద్ధానికి సరిపోయింది.  ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్స్‌కి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపు ఇబ్బందికరంగా మారనుంది.  తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్లపై రేట్లు పెరిగితే ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపైనా పడుతుంది.