Viral News: తమిళనాడుని అడిషనల్ ఫ్యామిలీ కోర్టులో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన  తన భార్యకు భరణంగా చెల్లించేందుకు రూ.80,000 విలువ గల రూ.2, రూ.1 నాణేలను తీసుకువచ్చాడు. అంతకుముందు తన భార్యకు మధ్యంతర నిర్వహణ మొత్తంగా రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ వీడియోలో వ్యక్తి నాణేలతో నిండిన రెండు తెల్లటి సంచులను పట్టుకుని, కోర్టు భవనం నుంచి బయటకు వెళ్లి, వాటిని కారులో ఉంచినట్లు చూపిస్తుంది. 


ఆ వ్యక్తి రూ.2, రూ.1 నాణేల 20 మూటలను ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లాడు. అలా మొత్తం రూ.80 వేలను సమర్పించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఓ నివేదిక ప్రకారం, ఆ మొత్తాన్ని నోట్లలో చెల్లించమని ఆ వ్యక్తిని ఆదేశించారు. మరుసటి రోజు, అంటే డిసెంబర్ 19న అతను.. కోర్టు సూచించినట్లుగానే నాణేల స్థానంలో కరెన్సీ నోట్లను కోర్టుకు సమర్పించాడు. దీంతో మిగిలిన మధ్యంతర నిర్వహణ మొత్తం రూ.1.2 లక్షలను త్వరలో చెల్లించాలని న్యాయమూర్తి ఆ వ్యక్తిని కోరినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..


Also Read : ఒక్కరోజులో రూ.6,500 పెరిగిన గోల్డ్‌ - ఏపీ, తెలంగాణలో రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ


ఈ వింత ఘటన తమిళనాడు కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టులో చోటు చేసుకుంది. వాడవల్లి ప్రాంతానికి చెందిన ఓ జంట కుటుంబ సమస్యల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు కోయంబత్తూరు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేశారు. దీనిపై చాలా కాలంగా విచారణ సాగుతోంది. విచారణ ముగియడంతో బాధితుడి భార్యకు రూ.2 లక్షల భరణం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే మొదటి వాయిదాగా రూ.80వేలు చెల్లించాలని భర్త కోర్టుకు వచ్చాడు.



ఆ తర్వాత అతను విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన రూ.80,000 భరణాన్ని రూ.1, రూ.2 నాణేలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రూ.80 వేల విలువైన నాణేలను 20 బ్యాగ్స్ లో పెట్టి.. వాటన్నంటిని తన కారులో పెట్టుకుని కోర్టుకు తీసుకుని వచ్చాడు. వాటిని భార్యకు భరణంగా ఇచ్చేందుకు కోర్టుకు రాగా.. అది చూసిన కోర్టు సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇలా చెల్లించడంపై అభ్యంతరం తెలిపిన కోర్టు.. అతన్ని డబ్బులను నోట్ల రూపంలో తేవాలని ఆదేశించింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అతను డబ్బును నోట్ల రూపంలో అందజేశాడు.


Also Read :వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య