CM Jagan Christmas Celebrations With Family Members: సీఎం జగన్ (CM Jagan) కడప (Kadapa) జిల్లా పర్యటన ముగిసింది. ఆయన కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరానికి బయల్దేరారు. ఈ ఉదయం పులివెందులలోని (Pulivendula) సీఎస్ఐ (CSI Church) చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం జగన్, ఆయన తల్లి విజయమ్మ (Vijayamma) కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ (New Calendar)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని మైదుకూరు వెళ్లారు. అక్కడ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
3 రోజుల పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పులివెందులలోని సింహాద్రిపురంలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్కు, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. కాగా, సింహాద్రిపురం మండల కేంద్రంలో రూ.11.6 కోట్లతో రోడ్ల సుందరీకరణ, రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో వైఎస్సార్ పార్కును సుందరీకరించారు. ఇందులో ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌండేషన్, చిన్న పిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వైఎస్సార్ విగ్రహాలను అందంగా ఏర్పాటు చేశారు. రూ.3.19 కోట్ల PADA నిధులతో నిర్మించిన తహసీల్దార్ ఆఫీస్, రూ.2 కోట్లతో న్యూ పోలీస్ స్టేషన్, రూ.3.16 కోట్లతో నిర్మించిన ఎంపీడీవో ఆఫీసును సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివెందుల నేతలతో భేటీ అయిన సీఎం వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచేలా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా పర్యటించి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అంతకు ముందు ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గుంటూరు పర్యటన
సీఎం జగన్ ఈ నెల 26న (మంగళవారం) గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడు చేరుకుంటారు. అక్కడ లయోలా పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన 'ఆడుదాం ఆంధ్రా' క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంవో కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read: Tadipatri MLA: తాడిపత్రిలో కరపత్రాల కలకలం! అందులో ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన ఆరోపణలు