Tadipatri MLA Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాడిపత్రి ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి ఎన్నికైన నాలుగు సంవత్సరాల కాలంలోనే దాదాపు అధికారికంగా 190 ఎకరాల భూమి కొన్నారని, అనధికారికంగా ఎంత ఉంటుందో అంటూ ఆ కరపత్రంలో ముద్రించారు. పుట్లూరు యల్లనూరు మండలాలలోని సోలార్ ప్లాంట్లకు సంబంధించిన భూమిని వాటి యజమానులను భయపెట్టి దోచుకున్నాడని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా దోచుకునే వాడు వద్దు - అభివృద్ధి చేసేవాడే ముద్దు అంటూ ముద్రించారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించారని, కొండలను, గుట్టలను, అటవీ భూములను సైతం అక్రమించారని అందులో ముద్రించారు.


కరపత్రంలోని ఇతర అంశాలు


దోచుకునే వాడు వద్దు - అభివృద్ధి చేసేవాడు ముద్దు.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రైతులను భయపెట్టి భూములు కొనుగోలు చేశారు. 2019లో పెద్దారెడ్డికి 53 ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు 2023 సంవత్సరం నాటికి 189 ఎకరాలు కొనుగోలు చేశాడు. ప్రభుత్వ భూములు ఆక్రమించారు. పుట్లూరు, యల్లనూరు మండలంలోని సోలార్ ప్లాంట్లకు రైతులు ఇచ్చిన భూములను, వాటి యజమానులను బెదిరించి రాయించుకున్నావు. కొండగుట్టలను, అటవీ భూములను ఆక్రమించుకున్నావు’’ అని కరపత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ముద్రించి పంచుతున్నారు.