Prithviraj defends violence in 'Animal' and 'Salaar': ప్రభాస్, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సలార్‘. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ‘సలార్’ చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర  వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అటు ‘యానిమల్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 1000 కోట్ల మార్క్ చేరేందుకు రెడీ అవుతోంది.  


హింసాత్మక సన్నివేశాలపై స్పందించిన పృథ్వీరాజ్‌


ఇక తాజాగా  ‘యానిమల్‌’, ‘సలార్‌’ చిత్రాల్లో మితిమీరిన హింస ఉందనే విమర్శలు వస్తున్నాయి. ‘యానిమల్’ సినిమాలో ఇంటిమేట్ సీన్లు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. హింసాత్మక సినిమాలతో నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ విమర్శలపై ‘సలార్‘ నటుడు పృథ్వీరాజ్‌ స్పందించారు.  సినిమాలో ఎంత హింస ఉండాలని నిర్ణయించే స్వేచ్ఛ దర్శకుడికి ఉండాలని అభిప్రాయపడ్డారు. “ప్రతి సినిమా సెన్సార్ బోర్డుకు వెళ్తుంది. వాళ్లు ఆయా సినిమాలకు ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా సినిమాలో ఏ కంటెంట్ ఉందో ప్రేక్షకులకు తెలుస్తుంది. వారు చూడాలో వద్దో నిర్ణయించుకుంటారు. సినిమా ఎలా తీయాలి అనే విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. కథకు అసరమైన అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. రీసెంట్ గా వచ్చిన ‘యానిమల్’ సినిమాలో హింస ఎక్కువగా ఉండనే మాటలు వినిపించాయి. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. అందుకే ఇప్పుడు మాట్లాడలేను. ‘సలార్’ విషయంలో మాత్రం కొన్ని సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయి. అవి సినిమాకు తప్పకుండా అవసరం. అందుకే దర్శకుడు వాటిని తెరకెక్కించారు. అవే కథను మందుకు తీసుకువెళ్తాయి. ఈ సినిమాలో హింసాత్మక సంఘటనల కంటే సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే ఈ సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో మాదిరిగా ఉంటుందని చెప్పాను” అని ఆయన వెల్లడించారు.


ఇక ‘సలార్’ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్  వ‌ర‌ద రాజమ‌న్నార్‌ అనే కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను విమర్శలకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకున్నారు.  పృథ్వీరాజ్‌ లేకుంటే ఈ సినిమాయే లేదని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ పలుమార్లు వెల్లడించారు.


‘సలార్‘ గురించి..


‘KGF‘ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.


Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్