China's New PM:
ప్రధానిగా ఎన్నిక..
చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికయ్యారు జిన్‌పింగ్. అప్పటి నుంచి ప్రభుత్వంలో మార్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లీ జియాంగ్ (Li Xiang)కు ప్రధాని పదవి అప్పగించింది చైనా. ఝెజియాంగ్‌కు గవర్నర్‌గా, షాంఘైలో పార్టీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన లీ జియాంగ్...అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనకు ప్రధాని పదవి కట్టబెట్టారు. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల పాటు పార్టీ సమావేశం జరిగింది. అప్పుడే లీ జియాంగ్‌కు ప్రధాని పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. దాదాపు పదేళ్లుగా లీ కెకియాంగ్ ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడాయనను పక్కన పెట్టి తన సన్నిహితుడికి నెంబర్.2 ఛైర్‌ను కేటాయించారు జిన్‌పింగ్. ఇప్పటికే జిన్‌పింగ్ రికార్డు సృష్టించారు. మావో జెడాంగ్ రెండు సార్లు చైనాకు అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించగా...ఆ రికార్డుని బద్దలుకొట్టి మూడోసారి ఆ పదవిని చేపట్టారు. మరో ఐదేళ్ల పాటు ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన ఎన్నికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికతో చైనాకు ఇకపై జీవిత కాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు జిన్‌పింగ్.
రాజ్యాంగ సవరణలు..
గతేడాది అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరిగాయి. అప్పుడే పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి...ఆ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ... దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నదీ సూచిస్తుంది. ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ అధికారికంగా ప్రకటన చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి..పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ అరుదైన ఘనత సాధించనున్నారు. దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాలం పరిమితి వర్తించదని 2018లో చేసిన రాజ్యాంగ సవరణతో జిన్‌పింగ్ జీవితకాలం చైనా అధ్యక్షునిగా కొనసాగేందుకు మార్గం సుగమం అయింది.
Also Read: Land-For-Jobs Scam: తేజస్వీ యాదవ్‌కు సీబీఐ సమన్లు, ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో విచారణ