Land-For-Jobs Scam:


దేశవ్యాప్తంగా సోదాలు..


దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని స్కామ్ కేసుల్లో భాగంగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తున్న అధికారులు దీని విచారణ ప్రారంభించారు. ఢిల్లీ, ముంబయి, పట్నాల్లో ఇప్పటికే సోదాలు జరిగాయి. బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. అటు సీబీఐ కూడా రంగంలోకి దిగి ఈ కేసుని విచారిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో ఆయన హస్తమూ ఉందని అనుమానిస్తోంది సీబీఐ. ఇదే కేసులో ఫిబ్రవరి 4వ తేదీన సమన్లు జారీ చేసిన సీబీఐ ఇప్పుడు మరోసారి సమన్లు పంపింది.