ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్-హిట్ సుక్మా జిల్లాలో సీఆర్ఫీఎఫ్ జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రా దళానికి చెందిన 38 మంది జవాన్లు కరోనా వైరస్ బారినపడ్డారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లోని ఎలైట్ వింగ్ అయిన కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) 202వ బెటాలియన్‌కు చెందిన సిబ్బందికి కరోనా సోకింది. సుక్మా జిల్లాలోని తేమెలవాడ క్యాంపులో 75 మంది సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు. వారిలో 38 మందికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత వారిని తమ శిబిరంలో క్వారంటైన్ చేశామని సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ బన్సోద్ తెలిపారు. మిగిలిన జవాన్ల స్వాబ్ నమూనాలను RT-PCR పరీక్షల కోసం జగ్దల్‌పూర్‌కు పంపారు. పాజిటివ్ కోబ్రా సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కోబ్రా 202వ బెటాలియన్‌కు చెందిన ఈ దళాలు ఆదివారం సుక్మా చేరుకున్నాయని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ శర్మ తెలిపారు. తేమెల్‌వాడలోని తమ యూనిట్ క్యాంపులో జవాన్లు తిరిగి విధుల్లో చేరారు. కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ పరీక్షలు చేశామని ఆయన తెలిపారు. కరోనా సోకిన జవాన్లను శిబిరంలో ఐసోలేషన్‌లో ఉంచినట్లు శర్మ తెలిపారు.
Also Read: కరోనా హై అలర్ట్.. మొత్తం 157 మంది వైద్యులకు పాజిటివ్
157 వైద్యులకు సోకిన కరోనా
బంగాల్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కర్ మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో 70 మంది వైద్యులు, నర్సులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. బిహార్ పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్) 87 మంది వైద్యులు కూడా కరోనా బారినపడడం కలకలం సృష్టించింది. ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే ఈ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మందికి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వీరంతా ఆస్పత్రి క్యాంపస్‌లో ఐసొలేషన్‌లో ఉన్నట్లు పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఎన్ఎంసీహెచ్లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందులో శనివారం 12 మందికి కరోనా సోకినట్లు తేలగా మరో 75 మందికి ఆదివారం వైరస్ నిర్ధరణ అయింది.
Also Read: WHO on Covid 19: 2022లో కొవిడ్ అంతం.. కానీ అలా చేస్తేనే సాధ్యం: డబ్ల్యూహెచ్ఓ
Also Read: Omicron Cases in India: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు