Garry Kasparov Dig At Rahul Gandhi: రష్యా చెస్‌ గ్రాండ్ మాస్టర్ గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇటీవలే రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా చివరకు రాహుల్‌నే ఫైనల్ చేశారు. ఈ క్రమంలోనే గ్యారీ కాస్పరోవ్ రాహుల్‌ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో పాటు వివాదాస్పదమూ అయింది. "ప్రధాని పదవిని ఆశించే ముందు రాయబరేలీలో గెలిచి చూపించండి" అంటూ రాహుల్‌ పేరు ఎత్తకుండానే సెటైర్లు వేశారు. దీనిపై కాంగ్రెస్‌ నుంచి గట్టిగానే కౌంటర్‌లు వచ్చాయి.






రాహుల్ గాంధీ నామినేషన్‌ వేసిన నేపథ్యంలోనే ఆ ఈ ట్వీట్ చేయడం వల్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఆయన మళ్లీ వరుస పెట్టి పోస్ట్‌లు పెట్టి క్లారిటీ ఇచ్చారు. తనకు భారత రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదంటూ పోస్ట్‌లు పెట్టారు. అయితే...ఇటీవలే రాహుల్ గాంధీ గ్యారీ గేమ్‌ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని రష్యన్ గ్రాండ్‌ మాస్టర్ ఆట తీరు నచ్చుతుందని ప్రశంసించారు. గ్యారీ అలా రాహుల్‌పై పోస్ట్‌లు పెట్టగానే కొందరు రాహుల్‌ కామెంట్స్‌ని వైరల్ చేశారు. గ్యారీ గురించి ఆయన గొప్పగా మాట్లాడిన వీడియోలు పోస్ట్ చేశారు. ఫలితంగా...గ్యారీ కాస్పరోవ్‌ వెంటనే స్పందించారు. 


"ఇది నేనేదో సరదాగా చెప్పిందే తప్ప భారత రాజకీయాలపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఓ వ్యక్తి చాలా మంది కళ్లు ఉంటాయి. వేలాది మంది గమనిస్తుంటారు. నా ఆటను అంతగా అభిమానించే రాజకీయ నాయకుడు ఓడిపోకూడదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను"


- గ్యారీ కాస్పరోవ్, రష్యా చెస్ గ్రాండ్ మాస్టర్ 


 






నామినేషన్‌ గడువు పూర్తవుతుందోనగా కాంగ్రెస్ రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అప్పటి వరకూ సస్పెన్స్ కొనసాగింది. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీయే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చాలా గట్టిగానే ప్రచారం చేశాయి. కానీ చివరకు రాహుల్ గాంధీ పేరునే ఖరారు చేసింది హైకమాండ్. కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న ఇక్కడ రాహుల్‌ని నిలబెడితే కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకంతో ఉంది అధిష్ఠానం.


Also Read: Lok Sabha Elections 2024: ప్రచారానికి డబ్బుల్లేక ఎంపీ టికెట్‌ తిరిగి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి