Cheetah Deaths: 


రెండు చీతాలు మృతి 


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవల రెండు చీతాలు చనిపోయాయి. అనారోగ్యంతో అవి మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మరణాలపై సౌతాఫ్రికా స్పందించింది. ఇలా చనిపోతాయని ముందే ఊహించినట్టు వెల్లడించింది. దక్షిణాఫ్రికా అటవీ, మత్య్స శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్ట్‌ రిస్క్‌తో కూడుకున్నదని తమకు తెలుసని స్పష్టం చేసింది. 


"2022 సెప్టెంబర్‌లో 8 చీతాలను భారత్‌లోని కునో నేషనల్ పార్క్‌కి తరలించాం. కానీ రెండు చీతాలు మృతి చెందాయి. ఒకటి నమీబియా చీతా కాగా..మరోటి సౌతాఫ్రికా నుంచి వచ్చిన చీతా. అవి చనిపోతాయని ముందుగానే ఊహించాం. ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న రిస్క్ అదే. అంతరించిపోతున్న చీతాలను రీ ఇంట్రడక్షన్ చేసే ప్రోగ్రామ్‌లో ఈ రిస్క్ తప్పనిసరిగా ఉంటుంది. అందులోనూ అవి వాతావరణానికి అలవాటు పడడం మరో సవాలు. ఒకేసారి అంత పెద్ద అడవిలో వదిలేసి వాటిని మానిటర్ చేయడం అంటే కష్టమే. రోజూ వాటి ఆరోగ్యాన్ని పరిశీలించాలన్నా కుదరని పని"


- సౌతాఫ్రికా అటవీ శాఖ 


మరో సంచలన విషయమూ చెప్పింది సౌతాఫ్రికా. ఆ చీతాలకు గాయాలయ్యే అవకాశాలున్నాయని, ఈ మరణాల రేటు మరింత పెరిగే అవకాశమూ ఉందని అంచనా వేసింది. రీ ఇంట్రడక్షన్ ప్లాన్‌లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్‌నీ గమనించాలని తేల్చి చెప్పింది. 


"అటాప్సీ రిపోర్ట్ వచ్చాక కానీ ఆ చీతాలు ఎందుకు మృతి చెందాయో చెప్పలేం. అయితే...ప్రాథమిక విచారణలో మాత్రం వాటికి ఇన్‌ఫెక్షన్‌ సోకిందన్న ఆనవాళ్లు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతానికి మిగతా చీతాల్లోనూ ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించడం లేదు. అన్ని సౌతాఫ్రికన్ చీతాలను మానిటర్ చేస్తున్నాం. పెద్ద ఎన్‌క్లోజర్‌లలో పెట్టి పరిశీలిస్తున్నాం. అవి కాస్త క్రూరంగా ఉంటాయి. అందుకే వాటి బిహేవియర్‌ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మరో రెండు నెలల్లో మిగతా చీతాలను ఎన్‌క్లోజర్‌ల నుంచి బయటకు వదులుతారు. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండాలి"


- సౌతాఫ్రికా అటవీ శాఖ 


తప్పిపోయిన చీతా..


కునో నేషనల్ పార్క్ (KNP) నుంచి తప్పిపోయిన చీతాను అధికారులు రక్షించారు. గత వారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ బార్డర్‌ని దాటి యూపీలోని అడవిలోకి వెళ్లిపోయింది చీతా. ఇది గుర్తించిన పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. చీతా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. మొత్తానికి పట్టుకుని మళ్లీ నేషనల్ పార్క్‌లోకి తీసుకొచ్చారు. ఈ నెలలో ఇలా చీతా దారి తప్పడం ఇది రెండోసారి. పార్క్ నుంచి చాలా దూరం ప్రయాణించిన చీతా ఎక్కడో తప్పిపోయింది. కేరళలోని శివ్‌పురి జిల్లా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టి శనివారం (ఏప్రిల్ 22) రాత్రి 9.30 నిముషాలకు నేషనల్ పార్క్‌లో వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలోని అడవికి వెళ్తున్న చీతాను గుర్తించి పట్టుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్ నుంచి ఝాన్సీ ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇన్ని కిలోమీటర్లూ దారి తప్పి వెళ్లిపోయింది మగ చీతా. 


Also Read: Watch Video: మీరు బాలీవుడ్‌లో ఉండాల్సింది, ఢిల్లీ పోలీస్‌ వాయిస్‌కి నెటిజన్లు ఫిదా