స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్ఎస్ఎల్)-2021 తుది ఫలితాలు ఏప్రిల్ 27న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మొత్తం 6,013 పోస్టులకు గాను 5998 అభ్యర్థులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపికచేసింది. వీటిలో జనరల్-2895, ఓబీసీ-1024, ఎస్సీ-981, ఎస్టీ-465, ఈడబ్ల్యూఎస్-633 పోస్టులు ఉన్నాయి. ఇక వీటిల్లోనే ఎక్స్-సర్వీస్‌మెన్-572, దివ్యాంగులకు-30, OH-63, HH-69, VH-64 పోస్టులు కేటాయించారు. వివిధ కారణాల వల్ల 35 మంది అభ్యర్థుల వివరాలను పెండింగ్‌లో ఉంచింది.


వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో 6013 లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. వీరిలో మొత్తం 5998 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. టైర్-1, టైర్-2, స్కిల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఈ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, ఎంపికకాని అభ్యర్థుల పూర్తి మార్కుల వివరాలు త్వరలోనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు కమిషన్ తెలిపింది. 


ఫలితాలకు సంబంధించిన వివరాలు ఇలా..


ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఇలా..


కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ - 2020 స్కిల్‌టెస్ట్‌ను జులై 1న నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను అక్టోబర్ 18న కమిషన్ విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ నిర్ణయించిన కటాఫ్ (డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్) ఆధారంగా 247 మంది, టైపింగ్ టెస్ట్ ఆధారంగా 11297 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. మొత్తం 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హులయ్యారు. 


మొత్తం ఖాళీలు 6013.. 
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2021 ద్వారా మొత్తం 6,013 పోస్టులకు గాను 5998 పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీచేయనుంది. వీటిలో జనరల్-2895, ఓబీసీ-1024, ఎస్సీ-981, ఎస్టీ-465, ఈడబ్ల్యూఎస్-633 పోస్టులు ఉన్నాయి. ఇక వీటిల్లోనే ఎక్స్-సర్వీస్‌మెన్-572, దివ్యాంగులకు-30, OH-63, HH-69, VH-64 పోస్టులు కేటాయించారు. 


గతేడాది మే 24 నుంచి జూన్ 10 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్ -2021' టైర్-1 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 54,092 మంది టైర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబరు 18న 'టైర్-2 (డిస్క్రిప్టివ్)' పరీక్ష నిర్వహించారు. టైర్-2 ఫలితాలను గతేడాది డిసెంబరు 16న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.


టైర్-2 ఫలితాల్లో మొత్తం 40,908 మంది అభ్యర్థులు టైర్-3లో స్కిల్ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీటికి సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా వెల్లడించింది. టైర్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలకు కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


Also Read:


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు ఖరారు, ఏ పరీక్ష ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఖరారు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 27న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రకటించిన తేదీల ప్రకారం ఆగస్టు 2 నుంచి 22 వరకు సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షలను, సెప్టెంబర్‌ 1 నుంచి 29 వరకు  ఎంటీఎస్‌ పరీక్షలను, అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు ఎస్‌ఐ(ఢిల్లీ పోలీస్) పరీక్షలను నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..