Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.ఇందుకోసం కేంద్రం రూ. 8400 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ G బ్లాక్ వరకూ మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌లను నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ కారిడార్‌లలో మొత్తం 8 స్టేషన్‌లుంటాయని వివరించారు.
"కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా రెండు మెట్రో కారిడార్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.8,400 కోట్లు కేటాయిస్తాం. లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ G బ్లాక్ వరకూ 8.4 కిలోమీటర్ల మేర ఓ కారిడార్ నిర్మించనున్నాం. ఈ కారిడార్‌లో 8 స్టేషన్‌లుంటాయి. ఇక రెండో కారిడార్ ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం చేపట్టనున్నాం. 2029 మార్చి నాటికి ఈ కారిడార్ల నిర్మాణం పూర్తవుతుంది."
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి