Poonam Kaur About Geethanjali Death: అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణి పూనమ్ కౌర్. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో పలు సినిమాల్లో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యింది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ అయ్యింది. తరచుగా పలు వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో గీతాంజలి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ‘జల్సా’ సినిమా వివాదంపైనా స్పందించింది.


ఏపీలో గీతాంజలి మృతిపై రాజకీయ దుమారం   


ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గీతాంజలి అనే మహిళ మృతి సంచలనం అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఆమెకు జగన్ సర్కారు ఆమెకు ఇంటి పట్టా అందజేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ ప్రభుత్వంలో తన కుటుంబానికి చాలా మేలు జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత గీతాంజలి చనిపోయింది. దీంతో ఆమె మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తల దారుణమైన కామెంట్ల కారణంగానే ఆమె చనిపోయిందంటూ వైసీపీ టార్గెట్ చేసింది. ఆమె రైలు ప్రమాదంలో చనిపోతే, తమపై అభాండాలు వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.


గీతాంజలికి న్యాయం జరగాలి!  


తాజాగా గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. గీతాంజలికి న్యాయం జరగాలని కోరారు. “అసలు ఆమె మరణం విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు చనిపోయే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌ లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం ఓ పార్టీ వారికి అలవాటు. దయచేసి గీతాంజలి మృతికి కారణం అయిన వారిని కఠినంగా శిక్షించండి. ఆమె పిల్లలకు న్యాయం చేయండి” అని పూనమ్‌ ట్వీట్‌ చేసింది.






అవన్నీ కట్టు కథలే!


అటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ తరచుగా ఘాటు విమర్శలు చేస్తుంది. అందుకే పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తారు. అంతేకాదు, ‘జల్సా’ సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఆమె వారిపై విమర్శలు చేస్తుందని ఆరోపించారు. తాజాగా ‘జల్సా’ ఆరోపణలపైనా ఆమె స్పందించారు. “అవన్నీ పుకార్లు మాత్రమే. నేను ఇంత వరకు సినిమా అవకాశాల కోసం ఎవరినీ అడుక్కోలేదు. కేవలం నటన మీదే ఆధారపడి లేను. ప్రత్యామ్నాయ జీవన మార్గాలు కూడా చూసుకున్నాను. నేను నటించిన సినిమాల కంటే వదులుకున్న సినిమాలే ఎక్కువ. కొంత మంది చేసే అర్థం లేని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని తన అభిమానులను పూనమ్ కోరింది.






Read Also: అమిత్ షాతో ‘హనుమాన్’ టీం భేటీ, ఆ విషయం చర్చకు రాలేదట!