Kolkata Doctor Case : కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో దోషి సంజయ్ రాయ్‌కు సీల్దా కోర్టు జీవితఖైదు విధించిన సంగతి తెలిసిందే. దోషి చనిపోయే వరకు జైలులోనే ఉండాలని కోర్టు పేర్కొంది. దీంతో పాటు అతనికి రూ.50 వేల జరిమానా కూడా విధించారు. బాధితుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ శిక్ష తగదని నిందితుడికి మరణశిక్ష విధించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది.
సీబీఐ ప్రకారంఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, దోషికి మరణశిక్ష విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సీబీఐ న్యాయ సలహా ఆధారంగా, శుక్రవారం నాటికి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయనుంది. సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించేందుకు అన్ని న్యాయపరమైన వాదనలు సమర్పించేందుకు సిద్ధమని సీబీఐ అధికారులు తెలిపారు.
Also Read : Donald Trump Inaugeration : ఇక మొదలెట్టడమే... వచ్చిన వెంటనే వలసదారుల ఏరవేత బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
సియాల్దా కోర్టు తీర్పుఈ కేసులో సోమవారం కోర్టు సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది. న్యాయమూర్తి అనిర్బన్ దాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నేరం ‘రేర్‌స్టాఫ్ రేర్’ కేటగిరీలోకి రాదని, అందువల్ల మరణశిక్ష విధించలేమని పేర్కొన్నారు.
తీర్పుపై బాధిత కుటుంబం అసంతృప్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి కుటుంబం కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ తలపెట్టిన హైకోర్టు అప్పీల్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. “న్యాయాన్ని సాధించే వరకు మేము ఆగం” అని వారి మాటల్లో ఆవేదన వ్యక్తమైంది.
సంజయ్ రాయ్ కుటుంబ స్పందనసంజయ్ రాయ్ కుటుంబం కూడా కోర్టు తీర్పును సమర్థించింది. "దోషికి మరణశిక్ష విధించినా మేము దానిని వ్యతిరేకించం. న్యాయం జరగాలని మేమూ కోరుకుంటున్నాం" అని సంజయ్ రాయ్ తల్లి తెలిపారు.
హైకోర్టులో పోరాటంఈ కేసు హైకోర్టులో కొనసాగనుండగా, న్యాయ పోరాటం మరింత గమనించాల్సిన అంశంగా మారింది. సీబీఐ వాదనలు, నిందితుడి తరఫు న్యాయవాదుల వ్యూహాలు న్యాయ ప్రక్రియను మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశముంది.