5000 Note in New Year: 2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే

RBI: 2025లో ఐదు వేల రూపాయల నోటు రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు చాలా కాలంగా ఉన్నాయి. ఆర్బీఐ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది.

Continues below advertisement

Is Five thousand rupee note will be released in 2025: కొత్త ఏడాది వచ్చేసింది. ఈ ఏడాదిలో ఎన్నో వింతలు జరుగుతాయని నెటిజన్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి ఐదు వేల నోటు వస్తుందని చెప్పుకోవడం. కొంత మంది నెటిజన్లు ఐదు వేల నోటు ఎలా ఉంటుందో ఊహింకుని ఏఐ గ్రాఫిక్స్ కూడా రెడీ చేసుకుని సర్క్యూలేట్ చేసుకుంటున్నారు. 

Continues below advertisement

అయితే ఈ ప్రచారం కొత్తది కాదు. చాలా కాలంగా జరుగుతోంది. చిన్న చిన్న డినామినేషన్లే ఉన్నాయని భారీ నగదు లావాదేవీలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని అందుకే ఐదు వేల నోట్లు తీసుకు వస్తారని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్‌ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఐదు వందల రూపాయల కన్నా పెద్ద డినామినేషన్ నోట్లు తీసుకు వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. అయితే ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోట్లను రద్దు చేసిన తరవాత కొత్త నోట్లను ప్రవేశ పెట్టారు. అతి పెద్ద డినామినేషన్ నోటుగా ఉన్న రెండు వేల నోటును ప్రవేశ పెట్టారు. అయితే వాటిని కూడా క్రమంగా ఉపసంహరించుకున్నారు. చెలామణి తగ్గించిన తర్వాత ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు వేల నోటు కూడా చెలామణిలో లేదు.   

Also Read: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో 

నిజానికి భారత్‌లో ఐదు వేల రూపాయల నోట్లు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ప్రవేశ పెట్టారు. 1954లో ఐదు వేలు, పదివేల రూపాయల విలువ చేసే నోట్స్‌ను ఆర్బీఐ ముద్రించిందది. 1978లో వెయ్యి నోట్లను తీసుకు వచ్చారు. అయితే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి, ఐదు వేలు, పదివేల నోట్లను రద్దు చేశారు. అవినీతి కి ఇవే ప్రధాన కారణంగా ఉన్నాయని భావించి వాటిని రద్దు చేశారు. ఆ తర్వాత వెయ్యి నోట్లు ప్రింట్ చేశారు కానీ అంత కంటే పెద్ద డినామినేషన్ ప్రింట్ చేయలేదు.                                           

Also Read: UK woman: ఆఫీసుకుస్పోర్ట్స్ షూ వేసుకొచ్చిందని ఉద్యోగం నుంచి తీసేశారు - కానీ రూ.32 లక్షలు కట్టాల్సి వచ్చింది !

అయితే అప్పట్లో పూర్తిగా నగదు లావాదేవీలు ఉండేవి. కానీ ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా ఐదు .. పది వంటి చిల్లర కూడా చెల్లిస్తున్నారు. అవినీతి లేకుండా ఉండటానికి ఇక ముందు పెద్ద డినామినేషన్ నోట్లు తెచ్చే అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది. మరో వైపు కేంద్రం కూడా రూ. రెండు లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీల్ని అనుమతించడం లేదు. అందుకే ఐదు వేల నోటు ఈ సంవత్సరమే కాదు.. ఏ ఏడాది తీసుకు రారని అంటున్నారు. 

 

Continues below advertisement
Sponsored Links by Taboola