కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన స్పష్టం చేశారు.
పీఎం మిత్రా పార్కుల ఏర్పాటు ద్వారా నేరుగా 7 లక్షలు, పరోక్షంగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని గోయల్ అన్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ, స్థానిక పెట్టుబడులు వస్తాయని పేర్కొంది.
ఏంటీ పథకం..
PM-MITRA (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులు) పథకాన్ని 2021 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. మన దేశంలోని టెక్స్‌టైల్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. వస్త్రాల తయారీకి ఒకే చోట స్పిన్సింగ్, వీవింగ్, ప్రాసెసింగ్/డైయింగ్, ప్రింటింగ్ జరిగే విధంగా సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా ఒక లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.
Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Also Read: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. రూ.45 లక్షల వరకు జీతం..