Maharashtra: మహారాష్ట్రలో వసాయి-విరార్‌లో ఆగష్టు 26 మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.  విజయ్ నగర్ విరార్ ఈస్ట్ లోని గణపతి ఆలయం సమీపంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు, 9 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

రాత్రి 1.00 గంటల సమయంలో కూలిన రమాబాయి అపార్ట్‌మెంట్ అనే నాలుగు అంతస్తుల భవనం కింద ఇంకా 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నారని ప్రాధమిక సమాచారం . ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

స్వామి సమర్థ్ నగర్, రాము కాంపౌండ్, నరంజి ఫాటా, విరార్‌లో రమాబాయి అపార్ట్‌మెంట్ అనే నాలుగు అంతస్తుల భవనం నాల్గవ అంతస్తులో కొంత భాగం కూలిపోయింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, పోలీసులు ఇప్పటివరకు 9 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది

ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. భవనం శిథిలాల కింద ఇంకా 15 నుంచి 20 మంది పౌరులు చిక్కుకున్నారని భావిస్తున్నారు.

10 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం

ఈ భవనాన్ని పదేళ్ల క్రితం నిర్మించారు ,మున్సిపల్ కార్పొరేషన్ దీనిని అత్యంత ప్రమాదకరమైన భవనంగా ప్రకటించింది. రమాబాయి అపార్ట్‌మెంట్‌ను ఇప్పుడు కూల్చివేశారు.

విరార్‌లోని నరంజిలో 10-15 సంవత్సరాల పురాతన భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే స్నేహా పండిట్ దూబే సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు 9 మందిని రక్షించారు. దాదాపు 20 మందికి పైగా చిక్కుకున్నారని భావిస్తున్నారు.  ఎన్డీఆర్ఎఫ్ బృందం, మహానగర్ పాలికా , పోలీసు బృందాలు రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయి.

ఇరుకైన సందు కారణంగా రెస్క్యూ కష్టం

MLA నుంచి అందిన సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, సంఘటనా స్థలానికి రెస్క్యూ కోసం వాహనం వెళ్ళలేకపోతోంది  , అంబులెన్స్ కూడా వెళ్లే మార్గం కనిపించడం లేదు. రెస్క్యూ బృందం ఎటువంటి సహాయం లేకుండా చేతులతోనే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించవలసి వస్తోంది.  బృందాలు 100 శాతం తమ ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతం, మరో 20-25 మంది సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. 

శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి జెసిబి యంత్రం అవసరం, అయితే అక్కడకు జెసిబిని తీసుకెళ్లడం కూడా కష్టం, దీని కారణంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

వసాయి (Vasai) ని బస్సేన్ అని కూడా పిలుస్తారు..మహారాష్ట్ర రాష్ట్రంలో కొంకణ్ డివిజన్లో ఉంది. ముంబైకి  దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న  ముఖ్యమైన నగరం వసాయి. ఒకప్పుడు పోర్చుగీసుల స్థావరంగా ఉండేది.  వసాయిలో ఏటా గణేష్ చుతుర్థి వేడుకలు అంబరాన్నంటుతాయి. నవరాత్రుల తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పదో రోజు నిమజ్జనోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. 

వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి