ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరో కీలక అప్‌డేట్ వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. 






ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా కొన్ని రోజుల క్రితం ఇలాంటి ప్రకటనే చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు.


వెనుకంజలో బీఎస్పీ..


ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే బహుజన్ సమాజ్ మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. ఇప్పటికీ ఏబీపీ- సీఓటర్ చేసిన సర్వేలో కూడా ఇది తేలింది.


403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. బీజేపీ 223 నుంచి 235 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఏబీపీ, సీఓటర్ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగా.. సమాజ్ వాదీ పార్టీ 145 నుంచి 157 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది.


మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 8 నుంచి 16 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 3 నుంచి 7 సీట్లతో సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.


సీఎంగా కూడా..


ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనే విషయంపై చేసిన సర్వేలో కూడా మాయావతి వెనుకంజలోనే ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 43% మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అఖిలేశ్ యాదవ్‌ సీఎం కావాలని 34% మంది అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి 14% మంది జై కొట్టారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి కావాలని 3% మంది మాత్రమే అన్నారు.


Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి