BRS Party News: ఈనెల 27వ తేదీ నుంచి పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. ఇప్పటికే ఎన్నికల అనంతరం పార్లమెంట్ నియోజకవర్గల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపిన కేటీఆర్.. ఈ నెల 27వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన సమావేశాలను హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహించుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. 


ఈ సమావేశాల్లో గత ఎన్నికలకు సంబంధించిన పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించుకోవడంతో పాటు, ఆ ఎన్నికల పోలింగ్ సరళి, స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాల వంటి అంశాల పైన విస్తృతంగా ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణ పైన కూడా చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశాల నిర్వహణను స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు బాధ్యత తీసుకుంటారని, ఈ సమావేశాలకు పలువురు కేంద్ర పార్టీ ప్రతినిధులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 


27 వ తేది మొదటి రోజు సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గం వర్గాల సమావేశాలు


28 తేదీ రెండో రోజు వర్ధన్నపేట, మెదక్, సిరిసిల్ల, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గల సమావేశాలు


29 తేదీ మూడో రోజు ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల్ నియోజకవర్గల సమావేశాలు