Periods Leave: నెలసరి (Menstruation ) సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి ( Central Minister ) స్మృతి ఇరానీ (Smriti Irani) వ్యతిరేకించారు. రుతుక్రమం అనేది మహిళకు వైకల్యం కాదని, ఆమె జీవితంలో జరిగే సహజ ప్రక్రియ గుర్తు చేశారు. ఈ సమయంలో సెలవుల వల్ల పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చన్నారు. రుతుక్రమం పట్ల ప్రత్యేక దృక్పథం ఉన్నందున...మహిళలకు సమాన అవకాశాలు నిరాకరించిన సమస్యలను ప్రతిపాదించకూడదని అన్నారు. 


స్మృతి ఇరానీ వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ (Brs) ఎమ్మెల్సీ (Mlc) కవిత (Kavitha ) తప్పు పట్టారు. ఒక మహిళగా సాటి మహిళలు పడుతున్న బాధలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మన పోరాటాలకు...మన ప్రయాణాలు ఓదార్పు కాదన్నారు. మహిళలకు అది అర్హమైనదని అన్నారు. వేతనంలో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమై స్త్రీలు అనుభవించే అసలైన బాధను విస్మరించడమేనన్నారు. ఒక మహిళగా సాటి మహిళలపై సానుభూతి లేకపోవడం బాధాకరమన్నారు. 


రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఇరానీ సమాధానం ఇచ్చారు. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై కేంద్రం ఏదైనా విధానానికి రూపకల్పన చేస్తుందా? అని ఎంపీ ప్రశ్నించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు స్మృతి ఇరానీ వెల్లడించారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని వెల్లడించారు. ఈ విధానం ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 10-19 ఏళ్ల వయసున్న అమ్మాయిల్లో వివిధ కార్యక్రమాల ద్వారా...నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు... ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్‌ మేనేజ్‌మెంట్ స్కీమ్‌‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. నెలసరి సెలవు అంశంపై ఓ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించారు. దీనిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షించాల్సి ఉంది. 


గతవారం కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ బదులిచ్చారు. అన్ని సంస్థల్లో వేతనంతో కూడిన నెలసరి సెలవును తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి పరిశీలనలో లేవన్నారు. రుతుస్రావం అనేది మహిళల్లో ఒక శారీరక ప్రక్రియ అని...కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా లేదా నెలసరి అనారోగ్యం వంటి సమస్యలతో బాధపడుతుంటారని అన్నారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను ఔషధాల ద్వారా నయం చేసుకోవచ్చని వెల్లడించారు.