Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు తీర్పును బీఆర్ఎస్ (BRS Party) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్వాగతించారు. బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఇది ఆమోదించదగ్గ విషయం అని కవిత అన్నారు. ఈ మేరకు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఎక్స్ లో స్పందించారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రతి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందని అనడానికి ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. న్యాయం గెలిచిందని స్పష్టం చేశారు.


కాగా, బిల్కిస్ బానో కేసులో (Bilkis Bano Case) దోషులను ముందస్తు విడుదల విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరుతూ గతేడాది మే నెలలో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ కవిత లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే.


What is Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు ఏంటి?
2002లో గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలో రంధీక్ పూర్ లో జరిగిన ఘటన ఇది. 21 ఏళ్ల బిల్కిస్ బానో (Bilkis Bano Gang Rape) పైన కొంత మంది అల్లరి మూక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. ఆ తర్వాత ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు 2003లో ఆదేశించగా.. సుదీర్ఘ విచారణ జరిగింది. అలా 2008లో నేరనిరూపణ జరగడంతో మొత్తం 11 మందికి స్పెషల్ కోర్టు జీవితఖైదు విధించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు యువతిపై ఈ అత్యాచార ఘటన జరిగింది.


జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని గుజరాత్ ప్రభుత్వం 2022లో విడుదల చేసింది. దీంతో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ సీపీఐ ఎంపీ సుభాషిని ఆలీ, జర్నలిస్టు రేవంతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ సహా పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దోషులకు శిక్షను రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దోషుల్లో ఒకరైన రాధేషామ్ షా న్యాయవాద వృత్తిని కూడా ప్రారంభించాడు. దీనిని బాధితులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


సుప్రీంకోర్టు వారిని విడుదల చేయడంపై దాఖలైన పిటిషన్లపై గతేడాది ఆగస్టులో విచారణ చేపట్టింది. గత అక్టోబరులో పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మూస పద్ధతిలో ఉన్నాయని.. సమయస్ఫూర్తిని ఉపయోగించి వారు నోటీసులు ఇవ్వలేని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు గుజారత్ ఇచ్చిన సొమంది దోషులకు ఉపశమనాన్ని రద్దు చేసింది. రెండు వారాల్లోగా జైలు అధికారులకు దోషులు 11 మంది లొంగిపోవాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.