Telangana News: 'ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది' - అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారని హరీష్ రావు ఆగ్రహం

HarishRao Comments: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అసత్యాలు మాట్లాడారన్నారు.

Continues below advertisement

BRS MLA Harishrao Comments on Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (HarishRao) మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని, పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ (Congress) నేతలు ప్రతిపక్షాల గొంతు నొక్కారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకే కాదని, బీజేపీ, ఎంఐఎం సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం లేదని చెప్పారు. అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి (RevanthReddy) సహా, మంత్రులు అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల సభల్లో చెప్పినట్లు అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు.

Continues below advertisement

సీఎంపై విమర్శలు

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 'పీవీ నర్సింహరావును ఢిల్లీ నాయకత్వం అవమానిస్తే నోరు విప్పలేదు. ఆనాడు టి.అంజయ్యను రాజీవ్ గాంధీ ఎలా అవమానించారో మర్చిపోయారా.?. మేం ప్రతి కార్యక్రమంలో అమరవీరులను తలుచుకుంటూనే ఉంటాం. సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి. విపక్ష నేతలు మాట్లాడకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారు.' అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయని, కానీ చేతలే గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. తప్పులు ఎత్తి చూపుతున్నందుకే సభలో తమను మాట్లాడనీయకుండా చేశారని అన్నారు.

'మూడుసార్లు మైక్ కట్ చేశారు'

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూసిందని హరీష్ రావు విమర్శించారు. 'సీఎం రేవంత్ రెడ్డి గంటన్నర సేపు మాట్లాడారు. మేం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ మా మైక్ కట్ చేశారు. క్లారిఫికేషన్ కు కూడా అవకాశం లేదు. సీఎం మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి 3 నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు.' అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమరులకు నివాళిగా సచివాలయం ఎదుటే అమరవీరుల స్మారకాన్ని నిర్మించుకున్నామని, ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా వ్యతిరేకించి, ఇవాళ ఉద్యమకారులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ 6.59 శాతం వృద్ధి సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని, నీతి ఆయోగ్ నివేదికలో ఈ విషయం స్పష్టమైందని గుర్తు చేశారు.

అసెంబ్లీ ఈ నెల 20కి వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 20 (బుధవారం)కి వాయిదా వేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శనివారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. అంతకు ముందు సభలో వాడీవేడీగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్, పేపర్ లీకేజీ, ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మార్పులు లాంటి అంశాలపై ప్రసంగించగా.. మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 

Also Read: Revanth Reddy vs KTR: రాష్ట్రం ఏర్పాటయ్యాకే తెలంగాణలో డ్రగ్స్! సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Continues below advertisement