Chiranjeevi- Gareth Wynn Owen: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరు.. ట్విట్టర్‌లో షేర్ చేశారు. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు చిరు తెలిపారు.
హైదరాబాద్‌కు కొత్తగా వచ్చిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్‌ను కలవడం ఆనందంగా ఉంది. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నాం. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలతో యూకేకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆయనకు విందు ఏర్పాటు చేసి.. మన తెలుగు వంటకాలను రుచి చూపించా. నోరూరించే అవకాయను కూడా ఆయన రుచి చూశారు. - చిరంజీవి, నటుడు
మర్చిపోలేను
మెగాస్టార్‌తో భేటీ తర్వాత బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. టాలీవుడ్ పరిశ్రమ గురించి మెగాస్టార్‌తో చర్చించినట్లు చెప్పారు. కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. భేటీకి సంబంధించిన ఫొటోలను సైతం పోస్టు చేశారు.
మీ అందమైన ఇంట్లో మీరు నాకు ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉంది. ఇంట్లో చేసిన దోసె, ఆవకాయ రుచిని నాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది నాకు చాలా కాలంగా గుర్తుండిపోయే ప్రత్యేక సాయంత్రం. మీ రక్తదాన కేంద్రాలలో మిమ్మల్ని మళ్లీ కలవాలని నేను ఎదురుచూస్తున్నాను. - గారెత్ విన్ ఓవెన్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
Also Read: Sukesh Chandrashekhar: 'జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ కోసం జైన్‌కు రూ.10 కోట్లు లంచం ఇచ్చా'