Bride kisses ex boyfriend just 2 hours before wedding : సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పూర్తి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక యువతి తన మాజీ ప్రియుడిని పెళ్లికి కేవలం 2 గంటల ముందు కలుస్తుంది. ఇద్దరూ హత్తుకుని, భావోద్వేగంతో మాట్లాడుకుంటారు. ఆమె అతని నుదురు మీద ముద్దు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడువైరల్ అయింది.
వీడియోలో ఏం జరిగింది? ఇన్‌స్టాగ్రామ్ డిసెంబర్ 13న పోస్ట్ చేసిన ఈ వీడియోలో వధువు పేరు శ్రేయ అని చెబుతుంది. ఆమె స్నేహితురాలు కారు డ్రైవ్ చేస్తూ "వైశ్నవ్ కెమిస్ట్" అనే ప్లేస్‌కు తీసుకెళ్తుంది. వధువు కారు నుంచి దిగి మాజీ ప్రేయసుడిని కలుస్తుంది. ఇద్దరూ దూరంగా నిల్చుని మాట్లాడుకుంటారు, హగ్ చేసుకుంటారు. తిరిగి కారులోకి వచ్చిన వధువు కన్నీళ్లతో ఉంటుంది. స్నేహితురాలు ఇప్పుడైనా నీ నిర్ణయం మార్చుకుంటావా? అని అడిగితే, ఆమె కారు స్టార్ట్ చే వాయిస్‌ఓవర్‌లో ఆమె పెళ్లి తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే జరుగుతోందని చెబుతారు.
ఈ వీడియోపై అందరూ రకరకాలుగా స్పందించారు. చాలా మంది అమ్మాయికు మద్దతుగా.. వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అయితే ఇలా తన ఎక్స్ ను కలిసేదుకు వెళ్లే యువతి వీడియో తీయిచుకోరని.. ఇది సోషల్మీడియాలో వైరల్ అయ్యేందుకు చేసిన వీడియోగా ఎక్కువ మందిభావిస్తున్నారు. ఇది పూర్తిగా స్క్రిప్టెడ్! డ్రామాటిక్ యాంగిల్స్, వాయిస్‌ఓవర్ – సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్ కోసమే చేసినట్లుందనిగుర్తిస్తున్నారు. అయినప్పటికీ, ఈ వీడియో గత సంబంధాలు, పెళ్లి ఒత్తిళ్లు, లాయల్టీ వంటి అంశాలపై విస్తృత చర్చను రేకెత్తించింది.