Vastu Tips: వాస్తు శాస్త్రంలో కామధేనువు ఆవును అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ధనం, సుఖం, శ్రేయస్సు పెరుగుతాయి. కామధేనువు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని, ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఏ ఇంట్లో అయితే ఈ విగ్రహం ఉంటుందో, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను పెంచుతుందని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు.
సరైన దిశ
వాస్తు ప్రకారం కామధేనువు విగ్రహాన్ని ఉంచడానికి ఉత్తర-తూర్పు దిశ అంటే ఈశాన్య మూల ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశ దేవతల దిశగా చెబుతారు. ఈ మూలలో కామధేనువును ప్రతిష్టించినప్పుడు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో ఈ విగ్రహం ఉంటే సుఖశాంతులు నెలకొంటాయి. వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీరు దీన్ని ఇంటి పూజా స్థలంలో లేదా లివింగ్ రూమ్‌లో కూడా ఉంచవచ్చు. విగ్రహాన్ని పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల దాని ప్రభావం పెరుగుతుంది. పొరపాటున కూడా దీన్ని దక్షిణ దిశలో ఉంచకూడదు. ఈ దిశ వాస్తు శాస్త్రానికి అశుభంగా పరిగణిస్తారు
కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు
కామధేనువు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుందని నమ్ముతారు. ధనానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి . బంధాల మధ్య నెలకొన్న విభేదాలు తగ్గుతాయి. దీనితో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాస్తు చిట్కాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కామధేనువు విగ్రహాన్ని దూడతో ఉంచడం శుభప్రదంగా చెబుతారు. ఇత్తడి, రాగి లేదా వెండి విగ్రహం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు వాస్తు నిపుణులు. విగ్రహం ముఖం ఇంటి లోపలికి ఉండాలి. దీన్ని ఎప్పుడూ శుభ్రమైన , ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. ఎలాంటి ఆసన లేకుండా నేరుగా నేలపై ఉంచవద్దు. ఈ విగ్రహం ముందు నిత్యం దీపం వెలిగించడం ,పువ్వులు సమర్పించడం మంచిది. దీన్ని బెడ్‌రూమ్‌లో లేదా దక్షిణ దిశలో ఉంచవద్దని గుర్తుంచుకోండి. ఇది సానుకూల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈ నియమాలు పాటిస్తే కామధేనువు ఆశీస్సులు లభిస్తాయి ఇత్తడి, రాగి, వెండి లేదా మార్బుల్‌తో చేసిన కామధేనువు విగ్రహాలు మంచివి.
ఇంట్లో ఒకే ఒక విగ్రహం మాత్రమే ఉంచండి.
పడకగది, కిచెన్ లేదా దక్షిణ దిశలో ఉంచకూడదు.
విగ్రహం శుభ్రంగా, గాజు షోకేస్‌లో కాకుండా ఓపెన్‌గా ఉంచండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది. ABP దేశంఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!Kerala