Meghasandesam Serial Today Episode: గగన్, భూమిని ఇంటికి ఆహ్వానిస్తాడు శరత్‌చంద్ర దీంతో శారద కొడుకు కోడలిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆ విషయం తెలిసి కేపీ హ్యాపీగా ఫీలవుతుంటే.. మీరా కోపంగా వస్తుంది.
మీరా: మీ కొడుకు కోడలిని తీసుకుని వస్తున్నాడని తెగ ఉత్సాహపడిపోతున్నారు. కళ్లల్లో కాంతులు ముఖంలో దీపావళి కనబడుతూనే ఉంది. ఆ కొడుకు అమ్మ నా సవతి శారద చేసిన అవమానం మాత్రం మీకు కనబడటం లేదా..? ఈ రోజు నాకున్న పసుపు కుంకుమలు అది వేసిన బిక్ష అంట. నేను ముష్టి దాన్ని అంట. ఇందూకు బతుకును ఇచ్చింది. ఈరోజు అది బతికేస్తుందంటే దానికి కారణం దాని కొడుకు. అదే ఈ రోజు వస్తున్న గగన్ గాడే నట. నన్ను ఎన్ని మాటలు అంది. నా మీద చేయి కూడా చేసుకుంది. నన్ను అంత అవమానించిన దాన్ని మీరు ఏం చేయాలి. వెళ్లి ఆ చెంప ఈ చెంప వాయించాలి.
కేపీ: (కోపంగా) చాలు ఇప్పటి దాకా నువ్వు చెప్పింది చాలు. ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకోను. చూడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత గగన్‌కు ఏదైనా అవమానం జరిగిందో నేన అసలు ఈ ఇంట్లోనే ఉండను..
మీరా: అంటే ఈ ఇంట్లో ఉండకుండా ఆ ఇంటికి వెళ్లిపోతారా..? ఇదేనా మీ ప్లాను..
కేపీ: ఈ ఒక్క ఆలోచన తప్ప నీ బుర్రలో ఏమీ ఉండదా..? నేను ఆ ఇంటికి వెళ్లగానే.. నాకేం వాళ్ళు హారతి ఇచ్చి స్వాగతం పలకరు. ఆ ఇంటి పెద్ద నాకొడుకు గగన్ వాడికి ఓ క్యారెక్టర్ ఉంది.
మీరా: అంటే నాకే క్యారెక్టర్ లేదా..?
కేపీ: ఎందుకు లేదు.. గగన్ ఇచ్చిన డబ్బు వల్ల ఇందు కాపురాన్ని నిలబడింది. అది తెలిసి నీ ఇగో హర్ట్ అయ్యి. ఇందు కాపురాన్నే కూల్చేంత గొప్ప క్యారెక్టర్ నీది. మన ఇందు చనిపోబోయిందని నీకు తెలుసా..? శారదకు తెలుసు. మన ఇందు తరపున శారద నిలబడింది. అది శారద క్యారెక్టర్. నీ క్యారెక్టర్ గురించి మీ వదిన క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి మరి. శారద కాపురం కూల్చి నన్ను నీకు కట్టబెట్టింది మీ వదిన. నువ్వేమో ఇందు కాపురం కూల్చేశావు. ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. నీది నీ వదినది కాపురాలు కూల్చే క్యారెక్టర్ అయితే ఆ ఇంటి వాళ్లది బతుకులు నిలబెట్టే క్యారెక్టర్. అది ఈ ఇంటికి ఆ ఇంటికి ఉన్న తేడా.. నక్కకి నాగలోకానికి ఉన్నతం తేడా..? మళ్లీ చెప్తున్నాను మీరా, గగన్ ఇక్కడికి వచ్చాక తనకు ఏదైనా అవమానం జరిగిందో
మీరా: ఏం చేస్తారు.. చంపేస్తారా..?
కేపీ: నేనేం చేయను.. నీ మేనకోడలు భూమి ఉంది కదా అది చాలు నిన్ను పాతి పెట్టడానికి. దానికి గగన్ అంటే అంత ప్రేమ. ఒకవేళ గగన్‌కు అవమానం జరిగితే నేను ఆ ఇంటికి వెళ్లను.. ఏకంగా పైకే వెళ్లిపోతాను.
అని చెప్పగానే.. మీరా ఏడుస్తూ చూస్తుంటుంది. కేపీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత గగన్, భూమి వస్తారు. వాళ్లతో ఒకరినొకరు దండలు మార్చుకోవాలని చెర్రి చెప్తాడు. దీంతో కేపీ, గగన్‌ను ఎత్తుకోవడానికి వెళ్లితే గగన్ కోపంగా చూస్తాడు. దీంతో కేపీ నీ తరపున కాదు భూమికి మేనమామగా ఎత్తుకుంటున్నాను అని చెప్తాడు. దీంతో శరత్‌చంద్ర, కేపీ కలిసి గగన్‌ను ఎత్తుకుంటే.. నక్షత్ర, అపూర్వ కలిసి భూమిని ఎత్తుకుంటారు. భూమి, గగన్ దండలు మార్చుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!