Chinni Serial Today Episode మ్యాడీ కావేరి, చిన్నిల ఫొటోలు చూసి చాలా చిరాకు పడతాడు. ఆ ఫొటోలు తనకు కనిపించకూడదు అని మ్యాడీ కోపంగా వెళ్లిపోతాడు. ఆ ఫొటోల వల్ల మ్యాడీ వల్ల చాలా డిస్ట్రబ్ అయ్యాడని అనుకుంటారు. 

Continues below advertisement

బాలరాజు తప్పించుకొని వెళ్లి చిన్నితో కావేరి ఆబ్దికం జరిపించాలని అనుకుంటాడు. బాలరాజు బాత్‌రూం అని చెప్పి కట్లు విప్పమని అంటాడు. రౌడీలు విప్పగానే రౌడీలను తోసేసి పారిపోతాడు. బయటకు వచ్చి చూసే సరికి ఆఫ్ టికెట్ ఉంటాడు. ఆఫ్ టికెట్‌ని పిలుస్తాడు. ఆఫ్ టికెట్ వెనక్కి తిరిగి చూసే సరికి మళ్లీ రౌడీలు బాలరాజుని పట్టుకుంటారు. ఆఫ్‌ టికెట్‌ని కూడా పట్టుకోవడానికి ఓ రౌడీ వెళ్తాడు. సరిగ్గా పట్టుకునే టైంకి మ్యాడీ అటుగా రావడం చూసి రౌడీ ఆగిపోతాడు. రౌడీ వెనక్కి వెళ్లిపోతాడు. మ్యాడీ బాబు వచ్చాడని మనల్ని చూస్తే చంపేసేవాడని చెప్పి కేవలం బాలరాజుని తీసుకొని వెళ్లిపోతారు.

మ్యాడీ బాధగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి చిన్నిని ఇష్టపడి ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అంటే మనసు రావడం లేదు అని అనుకుంటాడు. మ్యాడీ దగ్గరకు ప్రమీల వచ్చి మనసులో ఒకరు ఉంటే ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని బాధ పడుతున్నావ్ అని నాకు తెలుసు.. అని అంటుంది. ఇప్పుడే ఓ బాధలో ఉన్న నేను వెంటనే పెళ్లి అనగానే కష్టంగా ఉంది.. మమ్మీడాడీకి కొంచెం టైం ఇవ్వమని అడగాలి అనుకుంటే ఎలాగో అర్థం కావడం లేదు అని అంటాడు. ఇలాంటి అయోమయంగా ఉన్నప్పుడు నీ మనసుకి బాగా దగ్గర అయిన స్నేహితులతో నీ బాధ పంచుకో వాళ్లు మంచి నిర్ణయం చెప్తారు అని అంటుంది. మ్యాడీ వెంటనే మధు దగ్గరకు వెళ్తాను అని అంటాడు.

Continues below advertisement

దేవా బాలరాజు దగ్గరకు వెళ్తాడు. బాలరాజు తప్పించుకోవాలని ప్రయత్నించాడని తెలిసి దేవా  బాలరాజుతో తప్పించుకోవడం కంటే నీకు చావే బెటర్ అని అంటాడు. అయినా ఈ రోజు నీ పెళ్లాం చచ్చిన రోజు కదా.. కాదు కాదు నేను చంపిన రోజు అని అంటాడు. దానికి బాలరాజు నువ్వు చేసిన దానికి నువ్వు కుక్కచావు చస్తావురా అని అంటాడు. నీ చేత నీ పెళ్లానికి పిండం పెట్టించాలి అనుకుంటే నువ్వేంట్రా నాకు శాపాలు పెడుతున్నావని అంటాడు. ఇక కావేరి ఫొటో చూపించి నీ పెళ్లానికి సంతోషంగా పిండప్రదానం చేసుకుందువు అని చెప్పి పంతుల్ని పిలిపిస్తాడు. 

మ్యాడీ మధుని కలవడానికి ఇంటికి వెళ్తాడు. మధు వాళ్ల ఇంటికి తాళం వేసి ఉండటం చూసి అందరూ ఎక్కడికి వెళ్లుంటారు అని అనుకుంటాడు. మధు వాళ్లు చెరువు దగ్గర పిండ ప్రధానం చేస్తారు. మధుకి మ్యాడీ కాల్ చేస్తాడు. మధు ఫోన్ సైలెంట్‌గా పెట్టడంతో కాల్ లిఫ్ట్ చేయరు. మ్యాడీ పక్కింటి ఆవిడను అడిగితే ఏదో కార్యక్రమం ఉందని చెరువు దగ్గరకు వెళ్లారని చెప్తుంది. దాంతో మ్యాడీ చెరువు దగ్గరకు బయల్దేరుతాడు.

దేవా బాలరాజు చేత కావేరికి పిండ ప్రదానం చేయిస్తాడు. బాలరాజుతో పంతులు పిండాలకు దండం పెట్టుకునే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేరు అని బాలరాజు చెప్తాడు. దానికి దేవా ఉన్నారు తన కూతురు ఉంది కానీ ప్రస్తుతం ఇక్కడ లేదు అని అంటాడు. ఇక పంతులుకి డబ్బు ఇవ్వమని బాలరాజుతో దేవా చెప్తాడు. బాలరాజు తన దగ్గర డబ్బు లేక అలా ఉండిపోతే దేవా మనిషి బాలరాజుకి డబ్బు ఇచ్చి పంతులుకి ఇప్పిస్తాడు. దేవా బాలరాజుతో మిత్రుధర్మం ప్రకారం ఒక గిఫ్ట్ ఇచ్చా ఇప్పుడు శత్రు ధర్మం ప్రకారం మరో గిఫ్ట్ ఇస్తా అని చిన్ని ఫొటో కూడా ఇస్తాడు. అతి త్వరలోనే నీ కూతురు చిన్ని ఫొటోకి కూడా దండ వేసి ఇలాగే కార్యక్రమం జరిపించేలా చేస్తా అంటాడు. దాంతో బాలరాజు దేవా కాలర్ పట్టుకుంటే దేవా బాలరాజుని తోసేస్తాడు. నీ కూతుర్ని చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకుంటా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.