గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 16 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 December 16 Episode

Continues below advertisement

తల్లి, తండ్రిని కలిపేందుకు బాలు ప్లాన్ చేసి బామ్మ సుశీలమ్మను తీసుకొస్తాడు. ప్రభావతికి ఇంత గడ్డిపెట్టి..సత్యానికి క్షమాపణలు చెప్పిస్తుంది సుశీలమ్మ. అదే టైమ్ లో మనోజ్ ని ఇలా రా నాన్నా అని పిలిచి లాగిపెట్టి కొడుతుంది. వాడు తండ్రి డబ్బులు ఎత్తుకెళ్లిపోయినప్పుడే నువ్వు బుద్ధి చెప్పి ఉంటే ఈ రోజు ఇలా చేసేవాడు కాదు అంటుంది. నీ పెంపకం బాలేదు కాబట్టే వాడు ఇలా తయారయ్యాడని క్లాస్ వేస్తుంది. వెంటనే స్పందించిన బాలు ...బామ్మా వాడు సెట్టవ్వాలంటే నా దగ్గర ఓ ప్లాన్ ఉందంటూ..మింగేసిన డబ్బులు నెలకు 50వేలు చొప్పున తీర్చాలని కండిషన్ పెడతాడు. ఇది బావుంది..నువ్వే వాడిని చెడగొట్టావ్ కాబట్టి వాడి దగ్గర్నుంచి నెలకు 50వేలు వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత నీదే అని ప్రభావతికి ఆ పని అప్పగిస్తుంది సుశీలమ్మ. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుని లోపలకు వెళ్లిపోతాడు మనోజ్. నేనెందుకు ఇవ్వాలి అని అరుస్తుంటాడు.. నువ్వే దాచేశావ్ కాబట్టి నువ్వే ఇవ్వాలి అంటుంది రోహిణి. మీ బామ్మ రావడం వల్లే మీ అమ్మా నాన్నా మాట్లాడుకున్నారు లేదంటే మనవల్ల అయ్యేది కాదని చెబుతుంది.

ఇంతలో ప్రభావతి వచ్చి..నీవల్ల ఎప్పుడూ సంతోషం లేదు, ఉద్ధరిస్తాం అనుకుంటే నన్ను వేధించుకు తింటున్నావ్..నీ వల్ల అందరితోనూ మాటలుపడుతున్నా అంటుంది. నిన్ను కన్నందుకు నాకు లాభం లేదు..నిన్ను చేసుకున్నందుకు రోహిణికి మనశ్సాంతి లేదు..ఏం జన్మరా నీది అంటుంది..మరి నిన్నేం అనాలి? అని పెద్ద షాకిచ్చాడు మనోజ్. నువ్వు నన్ను కన్నది నానుంచి వచ్చిన సంపాదనను తిని కూర్చోవడానికా అనేస్తాడు...ఊహించని మాటకు ప్రభావతి షాక్ అవుతుంది. నిన్ను కన్నందుకు నాకు ఇలా జరగాల్సిందే ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావ్... రేపొద్దున్న మీ నాన్న నేను మంచంపడితే గంజినీళ్లు అయినా పోస్తావా అని కన్నీళ్లతో అడుగుతుంది. ఏదేమైనా కానీ డబ్బు మొత్తం అరెంజ్ చేయాల్సిందే అంటుంది.  

Continues below advertisement

ఆకలి అంటూ అందరూ కిందకు వస్తారు. తొందరగా చెయ్యవే అని మీనాను సాధిస్తుంది ప్రభావతి. అక్కడే ఉన్న సుశీలమ్మ ఏంటి అందరకీ అదొక్కతే చేయాలా? రెండు పొయ్యిలు ఉన్నాయి, రెండు పెనంలు ఉన్నాయి.. భర్తకు భార్య, భార్యకు భర్త దోసెలు వేసుకోండి అని ఆదేశిస్తుంది. అలా నాలుగు జంటలు దోశలు వేస్తారు. ఇక్కడ కూడా మనోజ్ శుద్ధ దండగ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎవరి ప్లేట్ లో దోశ వాళ్లు తినడం కాదు..తినిపించుకోండి అంటుంది సుశీలమ్మ. అందరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. సత్యం తినిపిస్తాడని ప్రభావతి వెయిట్ చేస్తుంది.... కానీ సత్యం తను వేసుకున్న దోశలు తను తినేస్తాడు. వీళ్లిద్దర్నీ గుడికి తీసుకెళ్లరా బాలు అంటుంది సుశీలమ్మ

మీనా వంట చేస్తుంటే వెళతాడు బాలు.. సెకెండ్స్ లో కారు తీసుకుందాం అనుకున్నాం కదా అంటాడు. ఈ రోజు మంచి రోజా కాదా అంటుంది. నువ్వు నవ్వు.. చందమామలా ఉన్నావ్ నువ్వు ఇలా నవ్వుతుంటే రోజూ నాకు మంచిరోజే అంటాడు బాలు. తీసుకుందాం అని నిర్ణయం తీసుకున్నారా అంటే అవునుకదా అంటాడు. అత్తయ్య మావయ్యని గుడికి తీసుకెళ్లమన్నారు కదా అని గుర్తుచేస్తుంది. సరే నేను వెళ్లి కారు తీసుకొస్తాను నువ్వు వంట పూర్తిచేసేస్తే అందరం కలసి వెళదాం అంటాడు బాలు. 

షాప్ కి వెళ్లిన మనోజ్.. దేవుడి ముందు నిల్చుని తన అసమర్థతను కూడా గొప్పగా చెప్పుకుంటూ తనింట్లో ఏదో అన్యాయం జరుగుతోందన్నట్టు చెప్పుకుంటాడు. నాకు ఏదైనా దారి చూపించి స్వామీ అనగానే...మనోజ్ గారు అంటూ ఎవరో పిలుస్తారు... ఓ  పేపర్ చేతిలో పెట్టి చదువుకోమంటాడు. నేను ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించకండి.. నీ చుట్టూ ఉన్నవారి వల్లే నీకు సమస్యలు వస్తున్నాయ్ జాగ్రత్త అని ఉంటుంది అందులో. ఇంతలో రోహిణి వస్తుంది...మనోజ్ తనకి వచ్చిన లెటర్ రోహిణికి చూపిస్తాడు.  షాక్ అవుతుంది రోహిణి.

'అఖండ 2' లో అష్టవామన (8 మంది బాల బ్రాహ్మణులు) బలి గురించి పురాణాల్లో ఉందా? అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!